తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Cabinet: ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలివే?

సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో మంత్రిమండలి సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర మంత్రిమండలి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఆమోదించడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

ALSO READ: మూడో రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. ప్రవేశపెట్టనున్న బిల్లులు ఇవే?

ఆమోదం తెలిపిన కీలక నిర్ణయాలు

  • నంద్యాల జిల్లా డోన్‌లో కొత్తగా హార్టికల్చరల్‌ పుడ్‌ ప్రాసెసింగ్‌ పాలిటెక్నిక్‌ కాలేజ్‌ ఏర్పాటుకు ఆమోదం
  • డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్శిటీ పరిధిలో హార్టికల్చరల్‌ పాలిటెక్నికల్‌ కళాశాల పని చేయనుంది.
  • డోన్‌లో వ్యవసాయం రంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో పాటు వ్యవసాయ పాలిటెక్నిక్‌ కాలేజీ ఏర్పాటు ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీ పరిధిలో ఈ కాలేజీ పనిచేయనుంది.
  • ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ యూనివర్సిటీస్‌ (ఎస్టాబ్లిస్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌) యాక్ట్‌ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్‌ఫీల్డ్‌ కేటగిరిలో మూడు ప్రైవేట్‌ యూనివర్శిటీలకు కేబినెట్‌ అనుమతిచ్చింది.
  • అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్‌ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీల ఏర్పాటుకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌
  • గవర్నర్‌ ప్రసంగానికి కేబినెట్‌ ఆమోదం

ALSO READ: రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో.. పార్టీ పేరు ఇదేనా?

సంక్షేమానికి పెద్ద పీట..

ఏపీ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ ఓట్ ఆన్ బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సంక్షేమానికి పెద్ద పీట వేయడంతోపాటు బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామని ఆర్థిక మంత్రి రాజేంద్రప్రసాద్ తెలిపారు. అదే విధంగా విద్య, వైద్యం, మహిళా సాధికారత, వృద్ధులకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. మరోవైపు ఇవాళ ప్రవేశపెట్టిన మూడు కీలక బిల్లులకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్జేయూకేటీ విశ్వవిద్యాలయం సవరణ బిల్లు -2024, ఏపీ అసైన్డ్ ల్యాండ్ (బదిలీ నిషేధ సవరణ బిల్లు) -2024, ఉద్యోగుల నియామకాలు, క్రమబద్ధీకరణ, రేషనైజేషన్ సంబంధిత సవరణ బిల్లు -2024 బిల్లులను ప్రవేశ పెట్టగా.. కేబినెట్ ఆమోదం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button