తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: జగన్ అదిరే ప్లాన్.. బాబుకు ఎదురు దెబ్బే!

ఆంధ్రప్రదేశ్ రాజకీయల్లో ఎన్నికల వేడి మొదలైంది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఒకవైపు వైసీపీ వైనాట్ 175 టార్గెట్, మరోవైపు టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా గెలుపు గుర్రాలను సిద్ధం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ మేరకు పని తీరు సరిగ్గా లేని దాదాపు 50 మంది సిట్టింగ్ స్థానాల్లో అధికార పార్టీ వైసీపీ మార్పులు చేయడంతోపాటు సామాజికవర్గాల వారీగా ఓట్ల లెక్కలు వేసుకుంటున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా కాపు ఓట్లు సాధించడమే లక్ష్యంగా సీఎం జగన్ మరో వ్యూహానికి తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: మున్సిపల్ కార్మికులతో ఏపీ సర్కార్ చర్చలు… సఫలం కానున్నాయా?

వైపీపీలోకి ముద్రగడ!

గత ఎన్నికల్లో భారీగా కాపు ఓట్లు వైసీపీకి పడిన నేపథ్యంలో ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఇందులో భాగంగా కాపు సామాజికవర్గంలో కీలకంగా ఉన్న వంగవీటి రాధతోపాటు ముద్రగడ పద్మనాభంను పార్టీలోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు ప్రజలు అనుకుంటున్నారు. గతంలో ముద్రగడతోపాటు చిరంజీవి కుటుంబ సభ్యులను టీడీపీ ప్రభుత్వం అవమానించడంతోపాటు నిందలు వేసిందని ప్రజలు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాపు ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకొనేలా వైసీపీ ప్రణాళికలు రచిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో పద్మనాభం లేదా అతని చిన్న కుమారుడు గిరిబాబుకు కాకినాడలో టికెట్, వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్‌ టికెట్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ALSO READ:  బండి సంజయ్ కి శ్రీరాముడి అక్షింతలు… X లో పోస్ట్

కాపు ఓట్ల ప్రభావం ఉండనుందా?

ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు ఖరారైంది. త్వరలోనే సీట్ల కేటాయింపుపై స్పష్టత రానుంది. అయితే కాపు సామాజిక వర్గంలో ఎక్కువమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారంటూ టీడీపీ, జనసేన పార్టీలు విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నాయి. దీంతోపాటు ఎక్కువమంది కాపు మద్దతుదారులు పవన్ కళ్యాణ్ వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నట్లు చెపుకొస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఉమ్మడి గోదావరి జిల్లాతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రభావం ఉంటుందని ఆ పార్టీల నేతలు భావిస్తున్నారు. కాగా, ఈ జిల్లాల్లో కాపు ఓటర్లు ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంటుందనే విషయాలపై వైసీపీ అధిష్ఠానం కూడా అంచనా వేస్తోంది. అయితే ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో సీఎం పదవిపై టీడీపీ నేత నారా లోకేష్ ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీడీపీ, జనసేనపై కాపు ఓట్ల ప్రభావం ఉండనుంది. మరోవైపు పవన్ ఒంటరిగా కాకుండా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడంతోనే కాపులు మరింత అసంతృప్తికి లోనై జనసేనను ఆదరించలేదని ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎవరికి మద్దతు తెలపాలనే విషయంపై కాపు సామాజికి వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button