తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Government: ‘సాగర్’పై సాహసం.. సీఎం జగన్ కీలక నిర్ణయం

ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న కృష్ణా జలాలపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా, సీఎం ఆదేశాలతో ఏపీ భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్‌ స్పిల్‌ వే 13 గేట్లతో సహా కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం తాగునీటి అవసరాల కోసం కుడి కాల్వకు 2,300 క్యూసె­క్కుల నీటిని విడుదల చేశారు. కాగా, కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కు­ల పరిరక్షణలో భాగంగా సీఎం జగన్‌ గత నాలుగున్నరేళ్లుగా రాజీలేని పోరాటం చేస్తున్నారు.

ALSO READ: పోలీసుల ‘పల్లె నిద్ర’.. శాంతి భద్రతల పరిరక్షణకు ఏపీ సర్కార్ కసరత్తు

సాగర్‌కు 15 టీఎంసీలు..

రాష్ట్ర విభజన సమయంలో కృష్ణా, గోదావరి నదీ బోర్డులు ఏర్పాటయ్యాయి. ఆ సమయంలో శ్రీశైలం జలాశయాన్ని ఆంధ్రప్రదేశ్‌, నాగార్జునసాగర్‌ను తెలంగాణ చూసుకోవాలని నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయం సరిగా అమలు కావడంలేదు. శ్రీశైలం జలాశయంలో ఎడమ విద్యుత్తు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్రమే చూసుకుంటోంది. అటువైపు ఆంధ్రప్రదేశ్‌ అధికారులను సైతం రానివ్వడం లేదు. అదే సమయంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో 26 గేట్లకు 13 గేట్లు ఏపీలోనే ఉన్నాయి. అయితే ఉమ్మడి జలాశయాలను బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్‌ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూ వస్తోంది. కాగా, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అక్టోబరు 6న కృష్ణా బోర్డు రాష్ట్రానికి 30 టీఎంసీలు కేటాయించింది. ఇందులో భాగంగా ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 15 టీఎంసీలను నాగార్జునసాగర్‌కు తెలంగాణ సర్కార్‌ తరలించిందని, మిగతా 15 టీఎంసీలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం సాగర్‌ కుడి కాలువ ద్వారా విడుదల చేసేందుకు తెలంగాణ సర్కార్‌ పట్టించుకోలేదు.

ALSO READ: నాగార్జునసాగర్ వద్ద సాగుతున్న వివాదం.. మంత్రి అంబటి కామెంట్స్

తప్పించుకునేందుకు చంద్రబాబు డ్రామా

2015లో శ్రీశైలం నుంచి నీటిని సాగర్‌కు తెలంగాణ తరలించింది. అయితే కుడి కాలువ కింద సాగు అవసరాల కోసం నీటిని విడుదల చేసే అంశంపై తెలంగాణ అధికారులు తోసిపుచ్చారు. దీంతో రాష్ట్ర భూభాగంలోని సాగర్‌ స్పిల్‌ వేలో 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకునేందుకు అప్పట్లోనే అధికారులతో కలిసి పోలీసులు సాగర్‌కు చేరుకున్నారు. కానీ, తక్షణమే వెనక్కి రావా­లని అప్పటి రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ను చంద్రబాబు ఆదే­శించారు. తద్వారా కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను హరించి వేస్తున్నా ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు తెలంగాణకు చంద్రబాబు తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది.

ALSO READ: శ్రీవారి ఆశీస్సులతో భవిష్యత్ కార్యాచరణ: చంద్రబాబు

నీటి వివాదంపై సీఎం జగన్‌ తెగింపు..

వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. గతంలోనూ తెలంగాణతో కృష్ణా నదీ జలాల పంపకం వివాదంపై లేవనెత్తారు. ఈ వివాదాలను పరిష్కరించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని, తెలంగాణ సర్కార్‌ అక్రమ ప్రాజెక్టులను నిలిపేయాలని కేంద్రాని సైతం ఫిర్యాదు చేశారు. అలాగే కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేయడం ద్వారా అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడి చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ తర్వాత శ్రీశైలం, సాగర్‌లలో రాష్ట్ర భూభాగం పరిధిలోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంకాగా.. తెలంగాణ నిరాకరించింది. దీంతో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్‌ స్పిల్‌ వే 13 గేట్లతో సహా కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను ఆధీనంలోకి తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ప్రభుత్వం 1,311 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button