తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Government: తేమశాతం పట్టించుకోవద్దు.. రైతులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ఆదివారం ‘మిచాంగ్’ తుపానుగా మారింది. డిసెంబర్ 5 నాటికి నెల్లూరు-మచిలీపట్నం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీలోని కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు సీఎం జగన్ రైతులకు శుభవార్త చెప్పారు.

ALSO READ: ఆటల ఆంధ్రప్రదేశ్‌గా ఏపీ.. యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం

ఏడు జిల్లాల్లో 2లక్షల టన్నుల ధాన్యం

ధాన్యం సేకరణలో తేమశాతం పట్టించుకోకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ధాన్యం సేకరించిన తర్వాత రైతులకు వెంటనే బిల్లుకు తరలించాలని సూచించారు. మొత్తం ఏడు జిల్లాల్లో అనగా తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో సుమారు రెండు లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని ఆదేశించారు. సదరు జిల్లాల్లో డ్రయర్లు లేకుండా పొరుగు జిల్లాలకు పంపాలని, అందుకు అయ్యే రవాణా ఖర్చులను కూడా భరించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయనుంది. కాగా, ప్రస్తుతం తుపాను ప్రభావం ఉన్న నేపథ్యంలో ఆన్‌లైన్‌ విధానానికి బదులుగా ఆఫ్‌లైన్‌ ద్వారా ధాన్యాన్ని సేకరించనున్నారు.

ALSO READ: జిల్లాలవారీగా ఎన్నికల విజేతలు వీరే..

రైతులకు తగ్గనున్న ఆర్థిక భారం

తుపాను ఉన్నందున రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యంను ఎక్కడికక్కడ సేకరించి సమీపంలోని మిల్లులకు తరలించనున్నారు. ధాన్యం సేకరణ తర్వాత రవాణా, కూలి, గోనె సంచుల ఖర్చులు ప్రభుత్వమే చెల్లిస్తుండటంతో రైతులపై ఆర్థిక భారం తగ్గనుంది. కాగా, నెల్లూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోనే ఎక్కువ డ్రయర్‌ సౌకర్యం మిల్లులు ఉన్నందున అక్కడికి తరలించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏడు జిల్లాల్లో సగటున ఒక్కోచోట 30వేల టన్నుల ధాన్యం ఆరబోత, లోడింగ్‌ దశల్లో ఉండగా.. రానున్న 24 గంటల్లోగా ఈ మొత్తం ధాన్యం తరలింపు ప్రక్రియను పూర్తి చేయనుంది. ఇప్పటికే 67,837 మంది రైతుల నుంచి రూ.1,017.77 కోట్ల విలువైన 4.66 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button