తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Government: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం..ఏపీ బాటలోనే!

రాష్ట్రంలో పాఠశాల విద్యకు అత్యధిక ప్రాధాన్యమిచ్చేలా సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలనిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నిస్తేజంగా మిగిలిన ఎస్సీఈఆర్టీ.. సీఎం జగన్ ఆదేశాలతో అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ఇంగ్లిష్‌ భాషా సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు పిక్టోరియల్‌ డిక్షనరీల విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో అమలవుతున్న ఈ విధానం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. గతేడాది కేంద్ర ప్రభుత్వం సైతం ప్రకటించిన పెర్‌ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌లో లెవల్‌–2 స్థాయికి చేరుకుని ఏపీ అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. అదే విధంగా ప్రధాని ఆర్థిక సలహా మండలి రూపొందించిన నివేదికలోనూ ఫౌండేషనల్‌ లిటరసీ, న్యూమరసీలో ఏపీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచినట్లు పేర్కొంది. తాజాగా, ఏపీ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల ఇంగ్లిష్‌ నైపుణ్య విధానం కర్ణాటక అధికారులను సైతం ఆకర్షించింది.

ALSO READ:  క్రీడలకు అడ్డా ఏపీ.. ఇదే సీఎం జగన్ కల.. నేటి నుంచే క్రీడా సంబరం

కన్నడ-ఇంగ్లిష్‌ భాషల్లో డిక్షనరీలు

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఇంగ్లిష్ నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పిక్టోరియల్‌ డిక్షనరీల విధానాన్ని కర్ణాటక ప్రభుత్వం కూడా అమలు చేయనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర అధికారులు ప్రభుత్వ విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే విద్యా సంవత్సరానికి ఏపీ తరహాలో తమ రాష్ట్ర విద్యార్థులకు సైతం పిక్టోరియల్‌ డిక్షనరీలను పంపిణీ చేయాలని ఆలోచిస్తోంది. అయితే ఇందుకోసం ఏపీ ఎస్సీఈఆర్టీ సహకారంతో కన్నడ-ఇంగ్లిష్‌ భాషల్లో డిక్షనరీలను రూపకల్పన చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది.

ALSO READ:  ఆణిముత్యాలను వజ్రాలుగా తీర్చిదిద్దుతాం: సీఎం జగన్

పిక్టోరియల్‌ డిక్షనరీల్లో ఏముంది?

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు అభ్యసన సామర్థ్యాలు పెరిగేలా జగన్ సర్కార్ పలు కార్యక్రమాలు చేపట్టింది. ఎస్సీఈఆర్టీ ఇందుకోసం విద్యా రంగంలో అగ్రశ్రేణి, ప్రసిద్ధ సంస్థలతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టీచర్లకు కంటెంట్, స్పోకెన్‌ ఇంగ్లీష్, కమ్యూనికేషన్‌ స్కిల్స్, మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వడం బోధనా సామర్థ్యాలను మెరుగుపరిచింది. దీంతో ఒకటి నుంచి ఐదు తరగతులకు సంబంధించిన పాఠాల్లోని పదాలతోపాటు రంగురంగుల బొమ్మలతో పిక్టోరియల్‌ డిక్షనరీని ఇంగ్లిష్‌-తెలుగు భాషల్లో పూర్తి శాస్త్రీయంగా రూపొందించారు. జగనన్న విద్యా కానుకలో భాగంగా 2021-22లో 23,72,560 మంది విద్యార్థులకు, 2022-23లో ఒకటో తరగతిలో 3,55,280 మందికి, 2023-24లో కేవీకే-4లో 3,08,676 మందికి కలిపి మొత్తం 30,36,516 డిక్షనరీలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇలా ప్రతిరోజు ఒక పదం నేర్పేలా స్కూళ్లకు ప్రణాళిక సైతం రూపొందించారు. దీంతో పాటు ‘లెర్న్‌ ఏ వర్డ్‌’ పేరుతో విద్యార్థులకు కొత్త ఇంగ్లిష్‌ పదాలు నేర్పేలా చర్యలు తీసుకుంది. ఈ విధానం కర్ణాటక అధికారులను ఆకర్శించింది. ఎలాగైనా తమ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button