తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Government: రోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వం దృష్టి.. ఏటీసీ కేంద్రాల ఏర్పాటుకు కృషి

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ముఖ్యంగా రాష్ట్రంలో రోడ్డుప్రమాదాలతో ఎందరో తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రమాదాలకు వాహనాల ఫిట్ నెస్ కూడా ఒక కారణం అని నివేదికలు వెల్లడిస్తున్నారు. అందుకే రోడ్డు ప్రమాదాలను, అదేవిధంగా ప్రాణ నష్టాన్ని నివారించేందుకు ఏపీ రాష్ట్ర రవాణాశాఖ ఆధ్వర్యంలో వాహనాలను పక్కాగా పరీక్షించి పక్కాగా ఫిట్ నెస్ సర్టిఫికెట్లను జారీచేస్తోంది.

Also read: Vijay Thalapathy: కొత్త పార్టీ పెడుతున్న స్టార్ హీరో.. ఫ్యాన్స్ మధ్య జోరుగా ప్రచారం

ఇక ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకుగాను రాష్ట్రంలో ఆటోమేటెడ్ విధానంలో వాహనాల ఫిట్ నెస్ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ప్రభుత్వం నెలకొల్పనుంది. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో 26 ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. పుణెలోని ఆటోమోటివ్ రీసెర్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఆర్ఏఐ) ప్రమాణాల మేరకు ఈ కేంద్రాలను ఏర్పాటు చేయబోతోంది. ఏడాదిలోగా ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది.

అన్ని జిల్లాల్లో ఏటీసీ కేంద్రాలు:

ఏటీసీ కేంద్రాల ఏర్పాటులో భాగంగా విశాఖను పైలట్ ప్రాజెక్టు ఎంపిక చేసి ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రూ.18.50 కోట్లతో నిర్మాణం చేపడుతున్న ఈ ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్ పనులు దాదాపు తుదిదశకు చేరుకున్నాయి. అలాగే రాష్ట్రంలోని మిగిలిన 25 జిల్లా కేంద్రాల్లో కూడా ఈ కేంద్రాల నిర్మాణానికి రవాణాశాఖ టెండర్లను ఆహ్వానించే ప్రక్రియ చేపట్టింది. మొదటి దశలో 15 జిల్లాలో ఏటీసీ కేంద్రాలు నిర్మించనున్నారు. ముందుగా శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం జిల్లా కేంద్రాల్లో ఏటీసీల నిర్మాణానికి త్వరలోనే బిడ్లను ఖరారు చేయనున్నారు. మిగిలిన జిల్లా కేంద్రాల్లో ఏటీసీల నిర్మాణానికి ఫిబ్రవరి మొదటివారం నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Also read: Pawan Kalyan: జనసేనాని కీలక వ్యాఖ్యలు.. సీట్ల కేటాయింపులో తగ్గేది లేదన్న పవన్

ఏటీసీ కేంద్రాలు ఎలా పనిచేయనున్నాయి?

రాష్ట్రంలోని ఆయా జిల్లాలో ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్లు జిల్లా హెడ్ క్వార్టర్స్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కేంద్రానికి 3వేల చదరపు గజాల స్థలాన్ని కేటాయించనున్నారు. ఈ కేంద్రాల్లో అధునాతన సెన్సార్లు, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడంతోపాటు.. ప్రత్యేకంగా డ్రైవింగ్ ట్రాక్ లను నెలకొల్పనున్నారు. అందులో కొన్ని లైట్ వెహికల్స్ కోసం, మరికొన్ని భారీ వాహనాల కోసం ట్రాకులను కేటాయించనున్నారు. ఫిట్ నెస్ చెకింగ్ కోసం వచ్చే వాహనాలు ఆ డ్రైవింగ్ ట్రాక్స్ లో ప్రయాణిస్తే సెన్సార్ల ద్వారా వాటి ఫిట్ నెస్ ను పరీక్షిస్తారు. బ్రేకుల పనితీరు, ఇంజన్ కండిషన్, ఇతర సమస్యలను గుర్తించి తగిన సర్టిఫికెట్లను జారీ చేస్తారు. ఈ వ్యవస్థలో ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా వెహికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందవచ్చు. దీనిద్వారా రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రభుత్వం చేపట్టే ప్రయత్నాలు మరింత సులభతరం కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button