తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Politics: అభివృద్ధి, సంక్షేమానికి దిక్సూచి.. సీఎం జగన్

అభివృద్ధిలో ఏపీ రాష్ట్రం దూసుకుపోతోంది. అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సంక్షేమంలో సీఎం జగన్‌ కొత్త శకానికి నాంది పలికారు. దేశంలో ఎక్కడా లేని వ్యవస్థ ఏపీలో అమలవుతోందని, ప్రజల వద్దకే నేరుగా ప్రభుత్వ పాలన అందుతోంది. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పథకాలు అందేలాచొరవ తీసుకోవడంతోపాటు ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వెళ్లేలా పాలన సాగిస్తున్నారు. కేవలం నాలుగేళ్లల్లోనే సీఎం వైఎస్ జగన్ అభివృద్ధి చేసి చూపించారు.

సంక్షేమ పథకాలివే..

సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. జగనన్న అమ్మ ఒడి, వైఎస్సాఆర్ ఆరోగ్య శ్రీ, వైఎస్సాఆర్ పెన్షన్ కానుక, వైఎస్సాఆర్ కాపు నేస్తం, పేదలకు ఇళ్లు, జగనన్న చేదోడు, వైఎస్సాఆర్ నేతన్న నేస్తం, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్సాఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్, వైఎస్సాఆర్ చేయూత, వైఎస్సాఆర్ వాహనమిత్ర వంటి సంక్షేమ పథకాలతో ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరే విధంగా అమలు చేసి వైఎస్సాఆర్ ప్రభుత్వం కొత్త చరిత్ర సృష్టించింది. అలాగే విద్యా, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. జగనన్న సివిల్స్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం, జగనన్న తోడు, జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్‌, సామాజిక సాధికార యాత్ర, వై ఏపీ నీడ్స్ జగన్ వంటి కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువ అయ్యారు. కాగా, ప్రభుత్వం ఇప్పటికే 99.5 శాతానికిపైగా మేనిఫెస్టో అమలు చేయడం ఓ చరిత్రే అని చెప్పుకోవాలి.

లబ్ధిదారుల ఎంపిక.. పారదర్శకం

సంక్షేమంలో జగన్ పాలన ఓ మైలు రాయి. ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకోవడంతోపాటు అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా పనిచేస్తోంది. అలాగే లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా సాగుతోంది. గ్రామ సచివాలయంలో జాబితాలో చోటుదక్కని అర్హులను చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అర్హులకు నేరుగా నగదు బదిలీ కావడంతో ఎంతో మేలు జరుగుతోంది.

పాలనలో సరికొత్త చరిత్ర

ఏపీ చరిత్రలో ఏ సీఎం చేయని విధంగా పథకాలు అమలు చేస్తున్నారు. ప్రతి పేదింటి మహిళలకు సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన జగన్.. సంక్రాంతి నాటికి రాష్ట్రంలో మరో 5 లక్షల పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని నిర్దేశించారు. కాగా, సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఏపీ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ఆయన ప్రతి అడుగు ఓ సంచలనమే. ఆయన చేపట్టే కార్యక్రమాలు ఏపీలో సరికొత్త చరిత్ర సృష్టించాయని, ఇక ఈ చరిత్రని ఎవరు తిరగరాయలేరని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button