తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Politics: హీటెక్కిన రాజకీయాలు.. షర్మిల ఏం మాట్లాడుతుందో అర్థమవుతోందా?

ఏపీలో రాజ‌కీయాలు హీటెక్కాయి. మ‌రో రెండు మాసాల్లో అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ తరుణంలో అధికార పార్టీ వైసీపీ అభ్య‌ర్థుల ఎంపిక‌తో వేగంగా దూసుకుపోతుండ‌గా.. ప్ర‌తిప‌క్షాలు అధికార పార్టీని గ‌ద్దెదింపాల‌న్న ల‌క్ష్యంతో పావులు కదుపుతున్నాయి. అయితే ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన వైఎస్ షర్మిల.. తాజాగా కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ వల్లే వైఎస్సార్ కుటుంబం చీలిందని, సాక్ష్యం దేవుడు, దీనికి సాక్ష్యం నా తల్లి వైఎస్సార్ భార్య విజయమ్మ అని చెప్పడంతో రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ALSO READ: ప్రొఫెసర్ కోదండరామ్‌ను కీలక పదవి.. గవర్నర్ ఆమోదం

అభివృద్ధి జరగలేదా?

ఏపీ అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ పీసీసీ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజలు పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు వైఎస్ షర్మిల ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని, ఆమెకు పక్కనే ఉన్న కిడ్నీ పరిశోధన కేంద్రం, ఆస్పత్రి, తాగునీటి ప్రాజెక్టు కనిపించట్లేదా? పోలవరం తొలిదశకు అదనంగా రూ.13 వేల కోట్లకు కేంద్రం ఆమోదం.. ఇవన్నీ కేంద్రంతో సఖ్యతగా ఉన్నందు వల్లే సాధించుకున్నట్లు ప్రజలు అనుకుంటున్నారు. అదే విధంగా విభజన హామీలైన ప్రత్యేక హోదా కావాలని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని, పోలవరం సవరించిన అంచనాల ప్రకారం రూ.56 వేల కోట్లు ఇవ్వాలని బహిరంగంగా ప్రధాని మోదీని జగన్‌ అడిగిన సంగతి తెలిసిందే. దీంతో పాటు హైదరాబాద్‌తో పోటీపడే సత్తా ఉన్న విశాఖను పరిపాలనా రాజధానిగా చేసేందుకు జగన్ ప్రయత్నిస్తుండగా.. అభివృద్ధి జరగలేదని వైఎస్ షర్మిల ఎలా మాట్లాడుతారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోలేదు.. అసత్య ప్రచారాలు నమ్మొద్దు

ప్రజలు ఏమైనా పిచ్చివాళ్లా?

ఎన్నికల సమయంలో తెలంగాణలో ఏం మాట్లాడిందో అప్పుడే మరిచిపోయిందా? ప్రజలు ఏమైనా పిచ్చివాళ్ల అంటూ పలువురు సెటైర్లు వేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చటమే లక్ష్యంగా.. రాజన్న రాజ్యాన్ని తీసుకురావడమే ధ్యేయంగా.. వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు దూషించింది. మరోవైపు 2021 అక్టోబర్ 20న తన తండ్రి వైఎస్సార్ పాదయాత్ర మొదలుపెట్టిన ప్రాంతం చేవెళ్ల నుంచే షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రలో భాగంగా తెలంగాణ ప్రభుత్వంపై షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ కోడలు, ఇక్కడే పుట్టిన, నా పిల్లలు ఇక్కడే పుట్టారు.. ఇక నాకేంటి ఆంధ్ర‌తో సంబంధం అంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button