తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Politics: చంద్రబాబు సభల్లో కనిపించని జనం.. కారణం అదేనా?

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో నిమగ్నమయ్యాయి. ఒకవైపు అధికార పార్టీ ‘సిద్ధం’ పేరుతో చేసిన బహిరంగ సభకు ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు టీడీపీ ‘రా..కదలిరా’ అనే కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అయితే టీడీపీ నిర్వహిస్తున్న ‘రా..కదలిరా’ సభలకు ప్రజల నుంచి రెస్పాన్స్ తక్కువగా రావడంతో టీడీపీ శ్రేణులు నిరాశ చెందుతున్నారు.

ALSO READ: బడ్జెట్ పై తెలంగాణ సర్కార్ కసరత్తు.. ఫిబ్రవరి రెండో వారంలో సమావేశాలు?

జనం లేక వెలవెల..

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మొదట ‘రా..కదలిరా’ అనే కార్యక్రమాన్ని కనిగిరిలో నిర్వహించగా.. ఈ సభ అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. అయితే నాటి నుంచి ఇటీవల జరిగిన నెల్లూరు, పత్తికొండ వరకు అన్ని సభలు జనం లేక వెలవెలబోయాయి. కొంతమందిని బలవంతంగా తీసుకొస్తే.. సభ మధ్యలోనే వెళ్లిపోతున్నారు. దీంతో టీడీపీ నేతలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏదో కొత్తగా, నూతనంగా ప్రసంగం ఉంటుందని, మహిళలను ఉద్దరించే పథకాలను ప్రకటిస్తాడని మరికొంతమంది ఎదురు చూస్తే.. మహిళలకు ఊకదంపుడు ప్రసంగమే వినాల్సి వచ్చిందని వాపోతున్నారు.

ALSO READ: యువతకు ఉపాధే లక్ష్యం..కాస్టిక్‌ సోడా హబ్‌గా కాకినాడ

బెడిసికొట్టిన వ్యూహం..

‘రా..కదలిరా’ ప్రతీ సభకు లక్ష మంది చొప్పున రప్పించాలనుకున్నటీడీపీ వ్యూహం బెడిసికొట్టింది. ఇదే కాకుండా ఈ సభల్లో కనీసం పది వేల మంది చొప్పున కూడా జనం హాజరు కాకపోవడంతో స్థానిక నేతలపై చంద్రబాబు తీవ్రంగా మండిపడినట్లు సమాచారం. సభలో ప్రజలు కనిపించకపోతే వేరే సంకేతాలు వెళ్తాయని చర్చించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రజా వ్యతిరేకతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు, పత్తికొండలో భారీ జన సమీకరణకు ఆ పార్టీ నేతలు యత్నించినా ఫలితం లేకపోయింది. ఈ రెండు జిల్లాల్లోనూ సభలు జనం లేక వెలవెలబోవడంతో పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం.

5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button