తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Chandrababu: చంద్రబాబుకు ఘోర పరాభవం.. ఏకంగా ఆయనకే నిరసన సెగ

ఏపీలో ప్రతిపక్షనేత చంద్రబాబు పరిస్థితి మరింత అగమ్య గోచరంగా తయారవుతోంది. అసలే రాష్ట్రంలో చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మకపోవడం, మరోవైపు రాష్ట్రంలో సీఎం జగన్ సారథ్యంలోని వైసిసి ప్రభుత్వ సంక్షేమ పాలనతో అన్నిరంగాల వారు ఆనందంగా ఉండటంతో.. ఓటర్లను తమవైపు తిప్పుకోవాలనే ప్రయత్నాలు పచ్చ పార్టీ అధినేతకు అస్సలు కలిసిరావడంలేదు. ఇక ఓంటరిగా ప్రయత్నించి లాభలేదని తెలుసుకుని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తనతో కలుపుకున్నారు. నిజానికి జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని.. రాష్ట్రంలో టీడీపీ పరిస్థితే అగమ్య గోచరంగా ఉంటే.. సీట్లు, ఓట్లు లేని జనసేన కలుపుకుని ప్రజా ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఆలోచన ఎంత అవివేకమో అర్థమవుతోంది.

Also read: Manohar Lal Khattar: సీఎం సంచలన నిర్ణయం.. పీఎం రిలీఫ్ ఫండ్ కు మొత్తం ఆస్తి

పొత్తులో లుకలుకలు:

మరోవైపు వచ్చే ఎన్నికల్లో టీడీపీ- జనసేన కలిసి పోటీ చేస్తాయని ఇరు పార్టీల అధినేతలు ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఇరుపార్టీల నేతల మధ్య అస్సలు పొసగడంలేదు. పొత్తులో భాగంగా ఎన్నికల్లో ఎక్కడ తమ సీట్లకు ఎసరు వస్తుందోనని ఇరు పార్టీలలోని నేతలు ఆందోళన చెందుతున్నారు. పైగా కలిసిపనిచేయాల్సిన వారు.. ఎవరికివారే కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఈ మేరకు తమతమ పార్టీ అధినేతలు క్యాడర్ కు దిశానిర్దేశం కూడా చేశారు. పైగా రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఏమాత్రం బాగలేదని.. కనుక ఆపార్టీతో కలిసి పనిచేయడంకంటే.. ఎన్నికలకు ఒంటరిగా పోటీచేస్తేనే కొన్ని ఓట్లు, సీట్లు వచ్చే అవకాశం ఉందని జనసైనికులు అధినేతకు వివరించారట కూడా. మరోవైపు పొత్తులో భాగంగా సీఎం సీటుపై కూడా ఎలాంటి క్లారిటీ తీసుకుని అధినేత పవన్ వ్యవహారంపై కూడా జనసైనికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో పార్టీలో తనపై చాలా ఒత్తిడి ఉందని.. అందుకే ఒత్తిడి తగ్గించేందుకే జనసేన పోటీచేసే రెండు స్థానాలు రాజాం, రాజానగరంను ప్రకటించారు. అలాగే కార్యకర్తలు తన మాట వినాలని.. అన్ని రకాలుగా తాను న్యాయం చేస్తానని దిశానిర్దేశం చేశారు. మరోవైపు సీట్ల ప్రకటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అసహనం వ్యక్తం చేశారు. పొత్తు ధర్మం పాటించకుండా పోటీచేసే స్థానాలను ఎలా ప్రకటిస్తారని.. ఇది మంచి పద్ధతి కాదని బహిరంగంగానే కామెంట్స్ చేశారు. దీంతో ఇరుపార్టీల మధ్య లొసుగులు బయటపడ్డాయి.

పరువుపోగొట్టుకుంటున్న బాబు:

ఇక రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి మరింత దిగజారిపోతోంది. అసలే పార్టీలో గెలుస్తామనే ధీమా లేక అధినేత క్యాడర్ లో జోష్ నింపేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఇక ఎన్నికల్లో ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు నిర్వహిస్తున్న రా.. కదలిరా సభలకు ప్రజలను నుంచి స్పందన ఉండట్లేదు. చంద్రబాబు నిర్వహించే ప్రతీ సభలోనూ ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. జనాలను సభలకు భారీగా తరలించాలని అధినేత.. నేతలకు సూచిస్తున్నా.. సమావేశాలకు వచ్చేందుకు ప్రజలే విముఖత చూపుతున్నట్టు సమాచారం. మరోవైపు సభలకు వచ్చే వారికి డబ్బు, మద్యం, బిర్యానీ ఇలా ఇస్తామని చెప్పినా రావడంలేదు. అరకొరగా వచ్చిన వారికి సమావేశం అనంతరం వారిని పట్టించుకోవడంలేదు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also read: TTD: టీటీడీ వార్షిక బడ్జెట్ ఆమోదం.. పాలకమండలి భేటీలో కీలక నిర్ణయాలు

ఇక సోమవారం రాజమండ్రిలోని కాతేరు జరిగిన రా.. కదలిరా సభలో చంద్రబాబుకు ఘోర పరాభవనం జరిగింది. సభలో చంద్రబాబు ప్రకటిస్తున్న సమయంలోనే టీడీపీ రాజానగరం ఇంఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి వర్గీయులు అందరి ముందే నిరసనకు దిగారు. అనంతరం సభావేదికపైకి వెళ్లి నిరసన చేశారు. ఈ సమయంలోనే జరిగిన వివాదంలో ఏకంగా చంద్రబాబునే పక్కకు తోసేయడంతో ఆయన కింద పడబోయారు. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆయనను రక్షించారు. ఈ ఘటనతో చంద్రబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తిరిగి వెళ్లిపోయే సమయంలోనూ కాన్వాయ్ కి అడ్డుపడి మరీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇలాంటి పరిస్థితి చూస్తుంటే రాష్ర్టంలో టీడీపీ- జనసేన కూటమి అధికారం దక్కించుకోవడం మాట పక్కనపెడితే.. కనీసం కొన్ని సీట్లైనా సాధించగలదా.. అని పార్టీనేతలు, ప్రజలు అనుకుంటున్నారు. పైగా సోమవారం రాజమండ్రిలో జరిగిన ఘటనలతో చంద్రబాబు పరువు పొగొట్టుకోకుండా.. ఇకనైనా హుందాగా వ్యవహరించాలని పలువురు రాజకీయ నేతలు అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button