తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

CM Jagan: ఆటల ఆంధ్రప్రదేశ్‌గా ఏపీ.. యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం

ఏపీని ఆటల ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం వైఎస్‌ జగన్ అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో ‘ఆడుదాం-ఆంధ్ర’ క్రీడా పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇప్పటికే క్రీడాకారుల రిజిస్ట్రేషన్‌తో పాటు క్రీడా పరికరాల పంపిణీ, విజేతలకు ప్రభుత్వం నగదు బహుమతులు సైతం ప్రకటించింది. ఈ మెగా టోర్నీ డిసెంబర్ 15న మొదలై దాదాపు 50 రోజుల పాటు జరగనుంది. ఈ టోర్నీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.41.43 కోట్లతో 5.09 లక్షల స్పోర్ట్స్‌ కిట్లను సిద్ధం చేసింది. ఇప్పటికే వీటిని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలకు తరలించగా పలు చోట్ల పంపిణీ చేశారు.

ALSO READ: ప్రజల ముంగిటకే వైద్య సేవలు.. దేశంలోనే ఏపీ టాప్

రోజువారీగా మ్యాచ్‌ల వివరాలు

‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీలను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించింది. రోజువారీగా మ్యాచ్‌ల వివరాలు, స్కోర్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయనున్నారు. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. తర్వాత నియోజకవర్గస్థాయి పోటీలను మాత్రం యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు సమాచారం.

ALSO READ: తెలంగాణలో ప్రభావం చూపించని పవన్… డిపాజిట్లు గల్లంతు

రూ.12 కోట్ల ప్రైజ్ మనీ

ఈ మెగా టోర్నీలో రూ.12 కోట్ల ప్రైజ్ మనీ అందించనున్నారు. అదే విధంగా రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. కాగా, ఈ టోర్నీలో 72 గంటల్లో 5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కాగా, తొలి దశ పోటీల్లో భాగంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో మొత్తం 1.50లక్షల మ్యాచ్‌లు.. 680 మండలాల్లో 1.42లక్షల మ్యాచ్‌లు, 75 నియోజకవర్గాల్లో 5,250 మ్యాచ్‌లలో పోటీలు నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button