తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

CM Jagan: వైసిపి ఎన్నికల శంఖారావం.. భీమిలిలో నేడు వైఎస్ జగన్ ‘సిద్ధం’ బహిరంగ సభ

ఏపీలో ఎన్నికలకు ఇంకా దాదాపు రెండు నెలల సమయమే ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో రాజకీయాలు ఇప్పటి నుంచే వేడెక్కాయి. ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే ఆశతో ఎవరికి వారే తమ తమ వ్యూహాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు రా.. కదలిరా పేరిట ఇప్పటికే బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇక రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగన్ ఈసారి కూడా అధికారం దక్కించుకునే వ్యూహంలో భాగంగా ప్రజలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను వివరిస్తూ.. వారికి మరిన్ని పనులు చేసేలా ఎన్నికల బహిరంగ సభలను నిర్వహించనుంది. అందులో భాగంగానే నేటి నుంచి వైసిపి ‘సిద్ధం’ బహిరంగ సభలకు శ్రీకారం చుట్టింది. నేడు విశాఖ జిల్లా భీమిలిలో ఈ బహిరంగ సభతో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.. వైసిపి అధినేత సీఎం జగన్.

Also read: AP Government: రోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వం దృష్టి.. ఏటీసీ కేంద్రాల ఏర్పాటుకు కృషి

భీమిలీలోని.. తగరపు వలస జంక్షన్ దగ్గర వైసీపీ భారీ సభను ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం 2.30 గంటలకు సిద్ధం నినాదాన్ని వినిపిస్తూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరిస్తారు. ఈసారి వైసీపీ.. సిద్ధం పేరుతోనే సభలను నిర్వహించబోతోంది. ప్రజలు కూడా మరోసారి వైసీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉండాలని కోరుతోంది. ఇప్పటికే వైసీపీ కార్యకర్తలు సిద్ధం ప్రచారాన్ని ప్రారంభించారు. తన ప్రచారంలో భాగంగా వైసీపీ భారీ ఎత్తున సిద్ధం హోర్డింగులను జిల్లాల్లో ఏర్పాటు చేస్తోంది. అలాగే.. సిద్ధం కరపత్రాలను ప్రజలకు పంచుతోంది.

మూడు రాజధానుల అంశంలో భాగంగా.. విశాఖను పరిపాలనా రాజధాని చెయ్యాలనుకున్న జగన్.. ఆ కారణంగానే.. విశాఖ నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు కనిపిస్తోంది. 2019 ఎన్నికల ప్రచారాన్ని కూడా ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభించారు. ఇవాళ్టి సభకు ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైసిపి కార్యకర్తలు రాబోతున్నారు. మొత్తం 3 లక్షల మందికి పైగా వస్తారనే అంచనా ఉంది. ఇక సిద్ధం సభలో సీఎం జగన్ ఏం మాట్లాడతారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన పనులు, అమలు చేసిన పథకాలను వివరించడంతోపాటూ.. మరోసారి గెలిపిస్తే, ఏం చెయ్యాలనుకుంటున్నారో కూడా చెప్పే అవకాశం ఉంది. అలాగే.. టీడీపీ-జనసేన కూటమిని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది.

Also read: Vijay Thalapathy: కొత్త పార్టీ పెడుతున్న స్టార్ హీరో.. ఫ్యాన్స్ మధ్య జోరుగా ప్రచారం

సిద్ధం అనేది సింపుల్ స్లోగన్.. ఇది ప్రజల్లోకి సులభంగా వెళ్తుందని వైసీపీ నమ్ముతోంది. భీమిలీ సిద్ధం సభ ద్వారా.. ప్రజల్లో వైసిపి ప్రభుత్వంపై మరింత సానుకూలత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. భీమిలి తర్వాత రాజమండ్రిలో సిద్ధం సభ ఉండనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 1న ఏలూరులో సిద్ధం సభ ఉంటుందని తెలుస్తోంది.

సిద్ధం’ ప్రచారంలో మీరూ భాగస్వామ్యం కావాలనుకుంటున్నారా?

ఇక వైసిపి అధినేత జగనన్న నిర్వహిస్తున్న సిద్ధం కార్యక్రమంలో మీరు భాగస్వామ్యం కావాలనుకుంటున్నారా.. అయితే

జగనన్నతో సిద్ధం వెబ్ సైట్ కు వెళ్లి మీ మద్దతు తెలిపేందుకు దీనిపై క్లిక్ చేయండి.

ప్రజలను ఆకట్టుకుంటున్న వైసిపి ‘సిద్ధం’ సాంగ్

మరోవైపు జగనన్న నిర్వహిస్తున్న సిద్ధం బహిరంగ సభలకు వైసిపి రూపొందించిన పాటకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. జై జై జైజై జై జగనంటూ.. సై సై సైసై నీ సాటేలేరంటూ సాగే ఈ పాట.. ఎన్నికలకు వైసిపి కార్యకర్తలు సిద్ధమంటూ గీతాన్ని విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button