తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Prakasam: ఈ రాజకీయాలు నావల్ల కాదు.. నేను తప్పుకుంటా: గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ పార్టీకి రాజీనామా చేయగా.. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు పూర్తిగా రాజకీయాల నుంచే వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత రాజకీయాలను చూసి విసుగు చెందుతున్నట్లు తెలిపారు. ప్రస్తుత రాజకీయాలపై, గిద్దలూరులో సొంత పార్టీ నాయకులే వ్యతిరేకంగా మారడంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

Also Read వైసీపీకి బై బై.. జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని కంభంలో బుధవారం నిర్వహించిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా అనే సందిగ్ధంలో ఉన్నా. కొందరు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏ కులానికి.. మతానికి నేను వ్యతిరేకం కాదు. రెడ్డి కులానికి ద్రోహం చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం’ అని తెలిపారు.

‘ఎలాంటి తప్పు చేయకపోయినా నేను నాలుగేళ్లుగా మానసిక క్షోభ అనుభవిస్తున్నా. అనవసరంగా మాటలు అనిపించుకోవాల్సి వస్తోంది’ అని భావోద్వేగానికి లోనయ్యారు. ‘ఇప్పటివరకు ఆస్తులు అమ్మేసి రాజకీయం చేస్తున్నా. కొందరు పార్టీకి నష్టం చేస్తున్నారని..అలాంటి విరమించుకోవాలని’ సూచించారు. ‘ప్రస్తుత రాజకీయాల్లో నేను ఇమడలేకపోతున్నా. రాజకీయాలకు నా ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. అనారోగ్య కారణాలు కూడా నేను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి మరో కారణం’ అని ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు.

Also Read బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ తొలి జీతం ఎంతో తెలుసా?

ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాకు మాగుంట చేసిందేమిటని ప్రశ్నించారు. 34 సంవత్సరాలుగా మాగుంట కుటుంబం రాజకీయాల్లో ఉందని.. వచ్చే ఎన్నికల్లో ఆ కుటుంబాన్ని ఆదరించవద్దని పిలుపునిచ్చారు. మాగుంట ఓటమి కోసం జిల్లా అంతా తాను పర్యటిస్తానని ఎమ్మెల్యే రాంబాబు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button