తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Hats off.. కలెక్టర్ అంటే ఈయనలా ఉండాలి.. గిరిపుత్రుల కోసం ఏం చేశాడంటే..

పార్వతీపురం: ప్రభుత్వ ఆస్పత్రిపై (Govt Hospital) ప్రజల్లో చిన్నచూపు ఉంది. మధ్య తరగతి ప్రజలైతే వాటి వైపు కన్నెత్తి కూడా చూడరు. అలాంటి వారికి అవగాహన కల్పించేందుకు.. ప్రజలను ప్రభుత్వ ఆస్పత్రులకు రప్పించేందుకు పార్వతీపురం మన్యం జిల్లా (Parvathipuram Manyam District) కలెక్టర్ నిశాంత్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన భార్య ప్రసవం ప్రభుత్వ ఆస్పత్రిలోనే అయ్యేలా చూశారు. మొదటి కాన్పు (Delivery) మారుమూల ప్రాంతంలో చేయించగా.. తాజాగా రెండో కాన్పు జిల్లా ఆస్పత్రిలో చేయించారు.

పార్వతీపురంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ సతీమణి ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. గైనకాలజిస్ట్ (Gynecologist) పర్యవేక్షణలో కాన్పు చేశారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. గురువారం డిశ్చార్జయ్యి ఇంటికి భార్య, బాబుతో కలెక్టర్ వచ్చారు. వారికి కుటుంబసభ్యులు హారతినిచ్చి స్వాగతం పలికారు. కాగా, గతంలో రంపచోడవరం (Rampachodavaram) ఐటీడీఏ పీఓగా విధులు నిర్వహిస్తున్న సమయంలో నేటి కలెక్టర్ నిశాంత్ కుమార్ తన భార్య మొదటి ప్రసవాన్ని కూడా స్థానికంగా ఉన్న చిన్న ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం జరిగేలా చూశారు.

Also Read వీడెవడో మాక్స్ వెల్ ను మించినోడు! ఎలా కొట్టినా ఫోర్లు, సిక్స్ లే

గిరిజనులకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కల్పించడం కోసం.. వైద్యం (Treatment), శస్త్ర చికిత్సలపై ఉన్న భయం పోగొట్టేందుకు తాను ఇలా చేస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ (Nishanth Kumar) తెలిపారు. ప్రముఖులు (VIPs) ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటే మారుమూల ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కుదురుతుందని పేర్కొన్నారు. గిరిజనులు నాటు వైద్యం కాకుండా ఆస్పత్రి వైద్యం పొందేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ చొరవను స్థానికులు అభినందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button