తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan: సొంత పార్టీ నేతలకు జనసేన అధినేత వార్నింగ్!

టీడీపీ, జనసేన పార్టీల పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ నాయకులపై నోరు పారేసుకున్నారు. మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శుక్రవారం నిర్వహించిన జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. టీడీపీ, జనసేన పొత్తు, భవిష్యత్తు కార్యాచరణ, సంయుక్త పోరాటం తదితర అంశాలపై మాట్లాడారు. టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తుకు వ్యతిరేకంగా ఏ స్థాయి నాయకులు మాట్లాడినా.. చిన్న కార్యకర్త మాట్లాడినా ఊరుకునేది లేదన్నారు.

ALSO READ: ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. తక్కువ ధరలకే సరుకులు

నేతల మనోభావాలు దెబ్బతీసిన పవన్..

టీడీపీ, జనసేన పార్టీ పొత్తుపై వ్యతిరేకంగా మాట్లాడితే వైఎస్సార్‌సీపీ కోవర్టులుగా తీసుకోవడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిర్ణయం నచ్చనివాళ్లు ఎవరైనా ఉంటే వైఎస్సార్‌సీపీలోకి వెళ్లిపోవచ్చని తేల్చి చెప్పారు. అయితే అంతకుముందు కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన భేటీలో జనసైనికలు, తెలుగు తమ్ముళ్ల మధ్య ఎమ్మెల్యే టికెట్ విషయంపై గొడవ జరిగింది. గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ ఓడిపోయినందున ఈసారి సీటు తనకు ఇవ్వాలని నియోజకవర్గ జనసేన ఇంఛార్జి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ కోరగా అవమానాలకు గురిచేశారు. వర్మ అన్న మాటలు పవన్‌ కళ్యాణ్‌ను ఉద్దేశించే అన్నారని.. తమ అధినేతను అవమానించారని జనసైనికులు ఆందోళనకు దిగారు. దీంతో పదేళ్లుగా జనసేనను నమ్ముకున్న పార్టీ నేతలతోపాటు కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా ఆత్మగౌరవాన్ని తుంగలో తొక్కుతూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ALSO READ: వైఎస్ షర్మిల ఇంట్లో త్వరలో పెళ్లిబాజాలు.. చకచకా ఏర్పాట్లు

బడా నేతలే అర్థం చేసుకుంటే.. మీకేమైంది?

ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా వంటి మహానేతలు సైతం తనను అర్థం చేసుకుంటున్నారని, కానీ తను పెంచి అండగా ఉన్న నేతలే తనను అర్థం చేసుకోవడం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. మిడిమిడి ఆలోచనతో తన నిర్ణయాలపై మాట్లాడే వాళ్లు పార్టీ నుంచి వెళ్లి పోవచ్చన్నారు. అంతేకాకుండా తన నిర్ణయాలపై సందేహాలు వ్యక్తం చేసిన ఎవరైనా సరే వైఎస్సార్‌సీపీలోకి వెళ్లిపోవచ్చని చెప్పారు. అలాగే టీడీపీని కూడా ఎవరైనా తగ్గించి మాట్లాడితే… పార్టీ వ్యతిరేక చర్యగా చూస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు. పొత్తుకు తూట్లు పొడవద్దు కోట్ల మంది ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఈ పొత్తుకు తూట్లు పొడిస్తే జనసేనకో, పవన్‌ కల్యాణ్‌కో తూట్లు పొడిచినట్లు కాదన్నారు. ప్రజల కోసం నిలబడాలనుకుంటున్న మోదానికి తూట్లు పొడిచినట్లు అవుతుందని జనసేన అధినేత అన్నారు. అందుకే అలాంటి చర్యలను సహించేది లేదన్నారు. ఏపీలో టీడీపీతో జనసేన పొత్తు నిర్ణయం ఆషామాషీగా తీసుకోలేదన్నారు.

2 Comments

  1. I absolutely love your website.. Pleasant colors & theme.
    Did you create this web site yourself? Please reply
    back as I’m looking to create my very own website and want to learn where
    you got this from or what the theme is named. Many thanks!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button