తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

PM Svanidhi: రాష్ట్ర మహిళలు దేశంలోనే అగ్రస్థానం.. ఎలా అంటే?

కేంద్ర ప్రభుత్వం కోవిడ్ సమయంలో వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో 2020 జూన్‌లో ‘ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్‌ నిధి’ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద బ్యాంకుల ద్వారా తొలుత ఎటువంటి హామీ లేకుండా రూ.10 వేలు రుణం పొందవచ్చు. అలాగే తీసుకున్న ఈ రుణాన్ని సకాలంలో చెల్లిస్తే వ్యాపారాభివృద్ధి కోసం రెండో దశలో రూ. 20 వేలు, మూడో దశలో రూ. 50 వేల రుణం పొందవచ్చు. దీంతోపాటు ఈ పథకం కింద లబ్ధిదారులందరికీ వడ్డీలో 7 శాతం చొప్పున రాయితీ కూడా లభిస్తుంది.

ALSO READ: మంత్రి రజనీ కార్యాలయంపై దాడి.. గుంటూరులో ఉద్రిక్తత

దేశంలోనే ఏపీ రెండో స్థానం

‘ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్‌ నిధి’ పథకం రుణాలను సద్వినియోగం చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 70 లక్షల మందికిపైగా లబ్ధి పొందినట్లు సమాచారం. ఇందులో రాష్ట్రంలో 74 శాతం మంది మహిళలు రుణాలు తీసుకోగా.. పురుషులు 26 శాతం మాత్రమే తీసుకున్నారు. కాగా, దేశ వ్యాప్తంగా రుణ గ్రహీతల్లో మహిళలు 43 శాతం ఉండగా.. పురుషులు 57 శాతం ఉన్నట్లు ఎస్‌బీఐ రీసెర్చి నివేదిక వెల్లడించింది. అదే విధంగా దేశ వ్యాప్తంగా రుణాలను ఖర్చు చేస్తున్న లబ్దిదారులు 22 శాతం మంది ఉండగా.. తొలి స్థానంలో పంజాబ్‌లో 32 శాతం, ఏపీలో 28 శాతం ఉన్నట్లు పేర్కొంది. అతి తక్కువగా పశ్చిమ బెంగాల్‌లో 17 శాతం, జార్ఖండ్‌లో 18 శాతం ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

ALSO READ: కాంగ్రెస్ ప్రోటోకాల్ ఉల్లంఘన చేస్తుంది: హరీశ్ రావు

రాష్ట్రంలో రూ.528.85 కోట్ల రుణాలు..

సీఎం వైఎస్‌ జగన్‌ నాలుగున్నరేళ్ల కాలంలో ప్రతీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా సాధికారితపై ప్రోత్సాహం అందించడంతో రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లోనూ ముందడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో తొలి దశలో 2,30,000 మందికి వర్తింపజేయాలని నిర్ణయించగా, ఇప్పుడు ఈ లక్ష్యాన్ని 3,15,000కు పెంచింది. ఇప్పటి వరకు మూడు దశల్లో కలిపి రాష్ట్రంలో 4,02,718 దరఖాస్తులకు రూ.528.85 కోట్ల రుణాలు మంజూరు చేశారు. దీంతో చిన్న వ్యాపారులు, సూక్ష్మ పరిశ్రమలకు కేంద్రం అందించే పీఎం స్వనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంతోపాటు కుటుంబాలను ఆర్థిక భరోసా ఇస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button