తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

TDP: మంత్రి అనిల్ చీటీ చించేసిన జగన్… మళ్ళీ ఎక్కడికి వెళ్తాడోనని చంద్రబాబు ఎద్దేవా

నెల్లూరులో నిర్వహించిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వైఎస్ఆర్సీపీ నేతకు సీటెక్కడో తెలియదని ఎద్దేవా చేశారు.

Also Read: అవినీతికి పాల్పడిన అందరి బాగోతాలు వెలికి తీస్తాం: సీతక్క

అభివృద్ధి నిల్లు… మాటలు ఫుల్లు అని విమర్శించారు. ఇతని గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుందని.. పోలవరం గురించి మాట్లాడితే పర్సెంటా, హాఫ్ పర్సెంటా అంటాడని ఎద్దేవా చేశారు. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తావంటే, బుల్లెట్ దిగుతుందంటాడని… నీటి పారుదల గురించి తెలియని నోటి పారుదల నేత ఈయన… అది మన ఖర్మ! అంటూ విమర్శించారు.

Also Read: రాజకీయాల నుంచి తప్పుకుంటున్న… గల్లా జయదేవ్ సంచలన వ్యాఖ్యలు

ఈయన తొడలు కొడతాడు, మీసం మెలేస్తాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, గావుకేకలు పెడతాడు… కానీ అభివృద్ధి గురించి అడిగితే నోరు కూడా తెరవడు… ఈయనొక పెద్ద ఎమ్మెల్యే! అని తెలిపారు. ఇవన్నీ చూసి ఇక్కడి ప్రజలు ఛీ కొడుతుంటే… ముఖ్యమంత్రి ఇతనికి సీటు లేదని చీటీ చించేశాడని ఆరోపించారు. ఇక్కడ్నించి ఎక్కడికో పంపిస్తాడట ఇతడ్ని అని… ఇంకా గాల్లో ఊగిసలాడుతున్నాడంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button