తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

TDP Party: లోకేశ్ యువగళం పాదయాత్రకు మళ్ళీ బ్రేక్… కారణం ఏంటంటే?

నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిచౌంగ్ తుపాను రేపు తీవ్ర తుపానుగా బలపడనుంది. ఈ రోజు మధ్యాహ్నంలోగా నెల్లూరు-మచిలీపట్నం మధ్య కృష్ణా జిల్లా దివిసీమ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. తీరం దాటే సమయంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో టీడీపీ యువనేత నారా లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Also Read: తేమశాతం పట్టించుకోవద్దు.. రైతులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్

యువగళంకు బ్రేక్

యువగళం పాదయాత్రకు మూడు రోజులపాటు విరామం ప్రకటించాలని నిర్ణయించారు. ప్రస్తుతం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ కొత్తపల్లి తీరంలో పొన్నాడ శీలంవారిపాకల వద్దకు పాదయాత్ర చేరుకుంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి. తుపాను ప్రభావం తగ్గిన తర్వాత ఈ నెల 7న మళ్లీ పాదయాత్ర ఆగిన చోటు నుంచే అంటే శీలంవారిపాకల నుంచే ప్రారంభం కానుంది.

Also Read: ఆటల ఆంధ్రప్రదేశ్‌గా ఏపీ.. యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం

ప్రజలకు సూచనలు

మిచౌగ్ తుఫాన్ ప్రభావంతో యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో పాదయాత్రకు మూడు రోజులు విరామం ఇస్తున్నట్లు నేతలు తెలిపారు. తుఫాన్ ప్రభావం తగ్గాక ఈనెల 7న మళ్లీ శీలంవారిపాకల నుంచి యువగళం ప్రారంభించనున్నారు. తుఫాన్ హెచ్చరికలతో ప్రజలు అప్ర‌మ‌ త్తంగా ఉండాలని… తుఫాన్ బాధితులకు పార్టీ కేడర్.. నేతలకు ఆస‌రాగా నిల‌వాలని ఆదేశించారు. విప‌త్తుల సంస్థ జారీ చేసే హెచ్చ‌రిక‌లు ప్రజలు ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తూ జాగ్ర‌త్త‌గా, అప్ర‌మ‌త్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు సుర‌క్షిత ప్ర‌దేశాల‌లో ఉండాలని… ఎట్టి ప‌రిస్థితుల్లో బ‌య‌ట‌కు రావొద్దన్నారు. అత్యవసర ప‌రిస్థితుల‌లో ఉప‌యోగ‌ప‌డేలా మొబైల్ ఫోన్లు ఛార్జింగ్ ఉంచుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button