తెలుగు
te తెలుగు en English
జాతీయం

Actor Vishal: రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో.. పార్టీ పేరు ఇదేనా?

తమిళనాడులో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. ఇప్పటికే స్టార్ హీరో దళపతి విజయ్ కొత్త పార్టీని తమిళ వెట్రి కళగం పేరుతో ప్రకటించగా.. తాజాగా మరో స్టార్ హీరో కొత్త పార్టీ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయాలు ఆసక్తికరంగా మారనున్నాయి.

ALSO READ: ఆటో డ్రైవర్ల కీలక ప్రకటన.. ఆ రోజు బంద్‌‌కు పిలుపు!

విశాల్ మక్కల్ నల ఇయక్కం..

ప్రముఖ నటుడు విశాల్ త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విశాల్ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించడంతోపాటు పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన అభిమాన సంఘం విశాల్ మక్కల్ నల ఇయక్కం నేతలతో మాట్లాడినట్లు సమాచారం. కాగా, 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ ప్రవేశం అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తలపై విశాల్ ఇవాళ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button