తెలుగు
te తెలుగు en English
జాతీయం

Bihar: బిహార్‌లో మళ్లీ వేడెక్కిన రాజకీయం!

బిహార్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మహాఘట్ బంధన్‌ కూటమి నుంచి ఎన్డీయేలోకి కొనసాగుతున్న ఫిరాయింపులు ఆ కూటమి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని, కూటమిని వీడిపోతున్నారు. తాజాగా ఎమ్మెల్యే భరత్‌ బిండ్‌ కూడా సీఎం నితీశ్ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరారు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నీతూ కుమారి సైతం పార్టీ మారనున్నట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో లోక్‌సభ టిక్కెట్‌ను ఆశిస్తున్న ఆమె.. టిక్కెట్ దక్కకపోతే బీజేపీలో చేరడం ఖాయంగా తెలుస్తోంది.

ALSO READ: వైసీపీ తొమ్మిదో జాబితా విడుదల.. ప్రత్యక్ష ఎన్నికల్లోకి విజయసాయిరెడ్డి!

బిహార్‌లో ఇటీవల రాజకీయ ప్రకంపనలు చెలరేగిన విషయం తెలిసిందే. అక్కడి మహాఘట్ బంధన్ కూటమి (జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్) నుంచి జేడీయూ అధినేత, సీఎం నితీశ్ కుమార్ వైదొలిగారు. బీజేపీ మద్దతుతో తిరిగి ఆయనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి మహాఘట్ బంధన్ కూటమిలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్జేడీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు జేడీయూలో చేరారు. ఇంకా పలువురు ఎమ్మెల్యేలు ఎన్డీయే కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా పరిణామాలతో 243 మంది సభ్యులున్న బిహార్ అసెంబ్లీలో ఎన్‌డీఏ బలం 135కు చేరుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button