తెలుగు
te తెలుగు en English
జాతీయం

CM Nitish Kumar: బీహార్ అసెంబ్లీలో బలపరీక్ష… వాకౌట్ చేసిన ఆర్జేడీ నాయకులు

ఇండియా కూటమిపై బిహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇండియా కూటమిలో ఉండటం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండియా కూటమి అభివృద్ధి కోసం వ్యక్తిగతంగా చాలా కష్టపడ్డానన్నారు. దేశ వ్యాప్తంగా అనేక పార్టీల అధినేతలతో మాట్లాడానని తెలిపారు. విపక్షాలను ఏకం చేస్తుంటే తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని ఆ సమయంలో తన నాయకత్వం కాంగ్రెస్‌కు నచ్చలేదని చెప్పారు. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కూడా త‌న‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆరోపించారు.

Also Read: సీఎం జగన్ అంటే పవన్ కళ్యాణ్‌కి వణుకు..! కారణం అదేనా?

అంతకుముందు అసెంబ్లీలో సీఎం నితీశ్ కుమార్ బలపరీక్షలో నెగ్గారు. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ సభ నుంచి వాకౌట్ చేసింది. దీంతో నితీశ్ సర్కారు 129తో బలపరీక్షలో గెలుపొందింది. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది కావాల్సి ఉంది. నితీష్ కుమార్ కూటమికి 129 మంది సభ్యుల సపోర్ట్ రావడంతో ప్రభుత్వ ఏర్పాటు సులభం అయింది.

Also Read: మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్… క్షమాపణ చెప్పాలని డిమాండ్

ఇటీవల బీహార్ లో మహాకూటమిలో విభేధాలు తలెత్తాయి. అనంతరం, నితీష్ కుమార్ (కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు) మహాకూటమి నుంచి వైదొలిగిన తర్వాత ఎన్డీఏ కూటమిలో చేరారు. ఆ తర్వాత సీఎంగా తొమ్మిదోసారి మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, బలపరీక్షకు ముందు బీహార్ అసెంబ్లీ ఆర్జేడీ నాయకుడు అవధ్ బిహారీ చౌదరిని హౌస్ స్పీకర్ పదవి నుంచి తొలగించే ప్రతిపాదనను ఆమోదించింది. దీని తరువాత, బీహార్ సీఎం నితీష్ కుమార్ అసెంబ్లీలో బిజెపి సహకారంతో ఏర్పాటు చేసిన తన కొత్త ప్రభుత్వానికి విశ్వాస ఓటు వేయడానికి ప్రతిపాదనను సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button