Animal: పార్లమెంట్ లో ‘యానిమల్’ సినిమా దుమారం.. నా కూతురు ఏడ్చింది
తండ్రీకొడుకుల అనుబంధంపై రూపొందిన ‘యానిమల్’ (Animal Movie) సినిమా సూపర్ హిట్ టాక్ అందుకోగా.. కలెక్షన్లతో దూసుకెళ్తోంది. రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor), రష్మిక మందాన్న (Rasmika Mandanna) కలిసి నటించిన ఈ సినిమాపై అందరూ ప్రశంసలు కురిపిస్తుండగా.. పార్లమెంట్ లో మాత్రం తీవ్ర వివాదం రేపింది. ఈ చిత్రాన్ని ఓ పార్లమెంట్ సభ్యురాలు తప్పుబట్టారు. సమాజానికి పట్టిన జబ్బు ‘యానిమల్’ సినిమా అని అభివర్ణించారు.
Also Read మహువా మొయిత్రీకి షాక్. లోక్ సభ సభ్యత్వం రద్దు
శీతాకాల సమావేశాల్లో భాగంగా శుక్రవారం జరిగిన రాజ్యసభలో (Rajya Sabha) కాంగ్రెస్ పార్టీ ఎంపీ రంజిత్ రంజన్ (Ranjeet Ranjan) మాట్లాడారు. ‘సినిమా అనేది సమాజంలో చాలా ప్రభావం చూపిస్తుంది. మనం సినిమాను చూస్తూనే పెరిగాం. కాబట్టి సినిమా అనేది యువతను ప్రేరేపిస్తుంది. వారిపై సినిమా ప్రభావం కూడా పడుతుంది. నా కూతురు (Daughter) తన స్నేహితులతో కలిసి యానిమల్ సినిమా చూసింది. కానీ సినిమా మధ్లోనే ఏడుస్తూ బయటకు వచ్చేసింది. సిక్కుల (Sikh) యుద్ధ గీతం అయిన అర్జన్ వైలీని హింసాత్మక సన్నివేశాలు కోసం వాడడం చాలా తప్పు. మొఘల్స్, బ్రిటీష్ తో పోరాడిన సిక్కుయోధుల వీరగాధను ప్రపంచానికి తెలిపిన పాటను ఇలా వాడడం సహించలేని అంశం. సమాజానికి పట్టిన జబ్బు యానిమల్ సినిమా. ఆ చిత్రంలో హింస, మహిళలపై వేధింపులు వంటి సన్నివేశాలు మినహా ఏమీ లేవు’ అని తెలిపారు. దీంతో యానిమల్ సినిమా వివాదానికి దారి తీసింది. సినిమాలో అర్జన్ వైలీ పాట వాడుకోవడంపై సిక్కు సంఘాలు కూడా తప్పుబడుతున్నాయి.
Also Read పార్టీ నాయకత్వానికి అనారోగ్యం.. గులాబీ పార్టీలో నిస్తేజం