తెలుగు
te తెలుగు en English
జాతీయం

Giriraj Singh: ఈడీ అధికారులపై దాడి… మమత బెనర్జీపై కేంద్ర మంత్రి విమర్శలు

పశ్చిమ బెంగాల్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందంపై దాడి ఘటనపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం మమత బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వాన్ని ఆయన ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వంతో పోల్చారు. ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యమన్నదే లేదని దుమ్మెత్తి పోశారు. రేషన్ పంపిణీ కుంభకోణం ఆరోపణపై తనిఖీలకు వెళ్లిన ఈడీ బృందంపై రాష్ట్రంలో దాడి నేపథ్యంలో ఆయన ఘాటు విమర్శలు చేశారు.

Also Read: జగన్ ఓడిపోతే సంక్షేమ పథకాలను రద్దు చేస్తారా..?

పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో తనిఖీలకు వెళ్తున్న సమయంలో ఈడీ అధికారుల బృందంపై టీఎంసీ నేత షాజహాన్ షేక్ మద్దతుదారులు దాడిచేశారు. వారు ప్రయాణిస్తున్న వాహనాలను ధ్వంసం చేశారు. రేషన్ పంపిణీలో కోట్లాది రూపాయల కుంభకోణంలో షాజహాన్ షేక్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ కూడా అధికారులపై దాడిని ఖండించారు. ఈ ఘటనలో గాయపడిన అధికారులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button