తెలుగు
te తెలుగు en English
జాతీయం

Mahua Moitra: మహువా మొయిత్రీకి షాక్. లోక్ సభ సభ్యత్వం రద్దు

లోక్ సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త (Bussinessman) నుంచి డబ్బులు తీసుకున్నారనే వివాదంలో కేంద్ర ప్రభుత్వం (Govt of India) సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రిపై కఠిన చర్యలు తీసుకుంది. ఆమె లోక్ సభ సభ్వత్యాన్ని రద్దు చేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా (Om Birla) ప్రకటించారు.

Also Read పార్టీ నాయకత్వానికి అనారోగ్యం.. గులాబీ పార్టీలో నిస్తేజం

పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని కృష్ణానగర్ (Krishnanagar) లోక్ సభ స్థానం నుంచి టీఎంసీ తరఫున మహువా మొయిత్రీ (Mahua Moitra) ఎన్నికయ్యారు. లోక్ సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని (Hiranandani) నుంచి మహువా డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆమె తీరుపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై పార్లమెంట్ నైతిక విలువ కమిటీ విచారణ చేపట్టి 500 పేజీలతో కూడిన నివేదిక రూపొందించింది. మహువా అనైతికంగా ప్రవర్తించారని, సభా ధిక్కరణకు పాల్పడ్డారని కమిటీ నిర్ధారించింది.

Also Read ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ.. అసలు ఆ పదవి ఏమిటి?

శీతాకాల సమావేశాల్లో (Parliament Session) భాగంగా శుక్రవారం మధ్యాహ్నం జరిగిన లోక్ సభలో ఆ కమిటీ నివేదికను ప్రవేశపెట్టారు. ‘ఎంపీ మహువా అనైతికంగా, అమర్యాదకరంగా ప్రవర్తించారని కమిటీ చేసిన తీర్మానాన్ని ఈ సభ అంగీకరించింది. దీనివలన ఆమె ఇక లోక్ సభ సభ్యురాలిగా కొనసాగడం తగదు’ అని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. మూజువాణీ ఓటింగ్ ద్వారా నివేదికను ఆమోదించిన తదనంతరం మహువాను సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు (Suspend) తెలిపారు. దీంతో మహువా లోక్ సభ (Lok Sabha) సభ్వత్యం కోల్పోయారు. ఈ నిర్ణయంపై మహువా ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో తనను మాట్లాడించే అవకాశం కల్పించలేదని మహువా మొయిత్రీ మండిపడ్డారు. స్పీకర్ నిర్ణయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఆమె ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button