తెలుగు
te తెలుగు en English
జాతీయం

Winter Session అలా అసెంబ్లీ సమరం ముగియగానే.. ఇలా పార్లమెంట్ సమరం

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) సమరం ముగియగానే.. ఢిల్లీలో పార్లమెంట్ సమరం షురూ కానుంది. డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత రోజు అంటే 4వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Winter Session) ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి (Prahlad Joshi) ప్రకటించారు. సభా సమరం షెడ్యూల్ ను విడుదల చేశారు.

చదవండి: అతడిని సీఎం చేయడం నా ఖర్మ.. అసలు తెలివి ఉందా

డిసెంబర్ 4న మొదలై 22వ తేదీ వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. మొత్తం 19 రోజుల్లో 15 రోజులు సమావేశాలు జరుగుతాయి. అమృత్ కాలంలో (Amrit Kal) జరుగుతున్న ఈ సమావేశాలు సజావుగా జరుగుతాయని ఆశిస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. సభా వ్యవహారాలు, ఇతర కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా, 2024 ఎన్నికలకు (2024 Elections) ముందు జరుగుతున్న చివరి సమావేశాలు కావడంతో కేంద్ర ప్రభుత్వం (NDA Govt) ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కీలకమైన బిల్లులను (Bills) ఆమోదింపచేసుకోవాలనే పట్టుదలతో కేంద్రం ఉంది. ఈ క్రమంలోనే ఒక దేశం.. ఒక ఎన్నిక బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును (Women Reservation Bill) ఆమోదించుకున్న విషయం తెలిసిందే. అదే మాదిరి కొన్ని బిల్లులను ఆమోదించుకుని ఇక ఎన్నికలకు వెళ్లాలని కేంద్రం భావిస్తోంది. అయితే దేశం, వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలపై ప్రతిపక్షాలు నిలదీసేందుకు సిద్ధమయ్యాయి.

చదవండి: సీఎం కేసీఆర్ నిజంగా దొరనే! ఆయన ఆస్తులు ఎంతో తెలుసా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button