తెలుగు
te తెలుగు en English
జాతీయం

TMC MP: ఉపరాష్ట్రపతిని వెక్కిరించిన ఎంపీ.. నెటిజన్స్ ఫైర్

తమను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష ఎంపీలు చేసిన నిరసన విమర్శలకు దారితీసింది. మంగళవారం కొత్త పార్లమెంటు ఆవరణలో మెట్లపై ప్రతిపక్ష ఎంపీలు కూర్చుని నిరసన చేశారు. ఈ సమయంలో రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్ ​ను అనుకరిస్తూ టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ వెక్కిరింపులకు దిగారు. ఆయన హావభావాలకు అక్కడున్న నేతలంతా నవ్వారు. ఎదురుగా నిలుచుని ఉన్న రాహుల్ గాంధీ.. తన ఫోన్‌లో రికార్డు చేయడం గమనార్హం.

Also read: Delhi: ఎంపీల సస్పెన్షన్‌ పై ఇండియా కూటమి కీలక నిర్ణయం

ఈ వీడియోలో కల్యాణ్ బెనర్జీ.. ‘‘నా వెన్నెముక నిటారుగా ఉంటుంది. నేను చాలా పొడగరిని’’ అని ఛైర్మన్‌లా అనడం కనిపించింది. దీనిపై జగదీప్ ధన్‌ఖడ్ తీవ్రంగా స్పందించారు. ఇది సిగ్గుచేటని, ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని మండిపడ్డారు. జగ్‌దీప్‌ ధన్‌ఖడ్ ​ను ఎంపీ కల్యాణ్ అనుసరిస్తున్న వీడియోను బీజేపీ షేర్ చేసింది. ‘‘ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ ​పై ఒకవేళ దేశం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్టయితే.. దానికి ఈ వీడియోనే సమాధానం. ఉపరాష్ట్రపతిని తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఎగతాళి చేస్తున్నారు. దీన్ని రాహుల్ ప్రోత్సహిస్తున్నారు. వీళ్లు సభలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో, ఎలా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతుంటారో ఊహించుకోవచ్చు” అని ట్వీట్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button