తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TS: ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ.. అసలు ఆ పదవి ఏమిటి?

తెలంగాణ కొత్త శాసన సభ రేపు కొలువుదీరనుంది. ఎన్నికైన శాసనసభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ప్రొటెం స్పీకర్ ఎవరు ఎంపికవుతారనే విషయంలో తీవ్ర చర్చ జరగ్గా.. చివరికి ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఎంపికయ్యారు. అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు.

Also Read ప్రొఫెసర్ కోదండ రామ్ కు ఏ పదవి? కాంగ్రెస్ మదిలో ఏముంది?

శాసనసభలో చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా కొన్ని కారణాలతో వారిని మినహాయించి అక్బరుద్దీన్ వైపు గవర్నర్ మొగ్గు చూపారు. ఆరుసార్లు శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికైన అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించనున్నారు. శాసనసభ్యుల ప్రమాణస్వీకారం రేపు శనివారం ఉండనుందని సమాచారం. మొదట ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ తో గవర్నర్ తమిళి సై ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత శాసనసభలో ప్రొటెం స్పీకర్ గా ఉన్న అక్బరుద్దీన్ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. ఈ ప్రక్రియతో తెలంగాణ మూడో శాసనసభ కొలువుదీరనుంది.

Also Read కేసీఆర్ త్వరగా కోలుకోవాలి: ప్రధాని మోదీ ప్రార్థన

ప్రొటెం స్పీకర్ అంటే..?
కొత్తగా ఎన్నికైన శాసన సభ, లోక్ సభ లో ఎన్నికైన వారిచేత ప్రమాణస్వీకారం చేయించడానికి స్పీకర్ ఉండాలి. అప్పుడే ఎన్నికై శాసనసభకు వచ్చినవారంతా కొత్తవారై ఉంటారు. దీంతో స్పీకర్ అనే వాళ్లు ఎవరూ ఉండరు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి ’ప్రొటెం స్పీకర్‘ అనే వెసులుబాటు కల్పించారు. సాధారణంగా ప్రొటెం స్పీకర్ గా సీనియర్ నాయకులే వ్యవహరిస్తారు. వారి అనుభవం.. వారికి గౌరవం కల్పించేందుకు సీనియర్లను ఎంపిక చేస్తారు. ప్రొటెం స్పీకర్ అవకాశం సాధారణంగా ప్రతిపక్షాలకే అధిక అవకాశం ఇస్తారు. తాజాగా ప్రతిపక్షంగా ఉన్న ఎంఐఎం పార్టీకి అవకాశం దక్కింది. ప్రొటెం స్పీకర్ విధి కేవలం సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించడం వరకే. ఒక్క మాటలో చెప్పాలంటే ’తాత్కాలిక స్పీకర్‘ గా చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button