తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Amit Shah: తెలంగాణలో అమిత్ షా పర్యటన.. లోక్ సభ ఎన్నికల కోసమేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది. ఇక ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం 39 సీట్లు సాధించి ప్రతిపక్ష పార్టీగా మారింది. ఇక కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. మరోవైపు బీజేపీ గత 2018 ఎన్నికల్లో ఒకే సీటు సాధించింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో రుఘునందన్ రావు, ఈటల రాజేందర్ గెలిచారు. దీంతో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక తాజా ఎన్నికల్లో ఏకంగా 8 స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటింది. కమలం పార్టీ తన ఓటు బ్యాంకును కూడా గణనీయంగా పెంచుకుంది. దీంతో పార్టీ ఇప్పుడు లోక్ సభ ఎన్నికలపై గురి పెట్టింది.

Also read: Bandla Ganesh: కేటీఆర్ స్వేదపత్రం ప్రజెంటేషన్.. బండ్లగణేష్ కామెంట్స్

అందుకే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ నెల 28న అమిత్ షా రాష్ట్రంలో పర్యటించబోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని కొంగరకలాన్‌ గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ మండలాల అధ్యక్షులతో అమిత్ షా సమావేశం ఉంటుందని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు. ఇక ఎన్నికల్లో బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు సహా కీలక నేతలంతా ఓటమి చెందారు. దీంతో లోక్‌సభ ఎన్నికలపై పార్టీ సీనియర్లకు షా కీలక సూచనలు చేయనున్నట్లు సమాచారం. ఎక్కువ ఎంపీ సీట్లు కైవసం చేసుకునేలా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button