తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Bandi Sanjay: రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన ఎంపీ… అధికారులపై ఆగ్రహం

హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని తంగళ్ళపల్లిలో CRIF నిధులతో చేపడుతున్న శనిగరం – సుందరగిరి రోడ్డు విస్తరణ పనులను కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. రోడ్డు పనులు సరిగ్గా చేయడం లేదని, ప్రతిరోజు దుమ్ముతో నానా ఇబ్బందులు పడుతున్నామని, ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోవడంలేదని స్థానికులు ఆయనకు అధికారులు, కాంట్రాక్టర్లపై ఫిర్యాదు చేశారు.

Also Read: మంత్రి అనిల్ చీటీ చించేసిన జగన్… మళ్ళీ ఎక్కడికి వెళ్తాడోనని చంద్రబాబు ఎద్దేవా

దాంతో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న చోటుకు వెళ్లి పరిశీలించి… ప్రజలకు ఇంత ఇబ్బందులు కలుగుతుంటే, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అధికారులను ప్రశ్నించారు. కేంద్ర నిధులు ఎక్కడ పెండింగ్ లో లేవని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతుంటే తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని, ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారని, కనీసం పనులను కూడా పర్యవేక్షించకుండా ఎందుకు పనుల్లో జాప్యం జరుగుతోందని అధికారులను నిలదీశారు.

Also Read: అవినీతికి పాల్పడిన అందరి బాగోతాలు వెలికి తీస్తాం: సీతక్క

రోడ్డు పనులను పూర్తిచేస్తే బీజేపీకి పేరు వస్తుందనే ఉద్దేశంతో పనులను ఆపేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ఇబ్బంది కలిగితే సహించే ప్రసక్తే లేదని, నాణ్యతతో మార్చి నెలాఖరులోపు రహదారి పనులను పూర్తి చేయాల్సిందేనని, గడువులోగా పూర్తి చేయలేకపోయినా, నాణ్యత లేకపోయినా చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button