తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

BRS: కేటీఆర్ కోసం క్యూ కట్టిన గులాబీ నేతలు.. కారణం అదేనా?

తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసేందుకు నేతలు క్యూ కట్టారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో టికెట్ కోసం ఆశావాహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు టికెట్ కేటాయించాలని నేతలు కేటీఆర్‌ను కోరారు. నిజామాబాద్ ‌ఎంపీ టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, నల్గొండ ఎంపీ స్థానాన్ని కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి, మరో సీనియర్ నేత శశిధర్ ఆశిస్తున్నారు. ఇక మల్కాజ్‌గిరి ఎంపీ సీటు కోసం ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి ఆశలు పెట్టుకున్నారు.

Also read: Governor Tamilisai: ఓటరు దినోత్సవంలో గవర్నర్ తమిళిసై.. కొందరు చస్తామని ఓట్లు అడిగారని సెటైర్లు

మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సికింద్రాబాద్ లేదా మల్కాజ్‌గిరి ఎంపీ స్థానం కోరుతున్నారు. గువ్వల బాలరాజు నాగర్‌ కర్నూలు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మహబూబ్‌నగర్ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని గడ్డం శ్రీనివాస్‌ యాదవ్, మహబూబాబాద్‌ ఎంపీ సీటు మాజీ ఎంపీ సీతారామ్ నాయక్ ఆశిస్తున్నారు. రేపు కేసీఆర్ అధ్యక్షతన జరిగే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో టికెట్ల అంశం చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. అందులో భాగంగానే నేతలంతా అధినాయకత్వాన్ని కలిసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button