తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Election Affidavit పాలమ్మిండు.. పూలమ్మిండు.. కానీ సొంత కారు కొనలేదు

పాలమ్మినా.. పూలమ్మినా అంటూ ప్రసంగం చేసి సోషల్ మీడియాలో స్టార్ గా మారిన తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ (BRS Party) మేడ్చల్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డికి (Mallareddy) సొంత కారు లేదంట.. చేతిలో చిల్లీగవ్వ లేదంట. వేల ఎకరాలు ఉన్నాయంటాడు.. యూనివర్సిటీలు.. కాలేజీలు, దవాఖానాలు ఇలా ఎన్నో ఉన్నాయంటాడు.. కోట్ల ఆస్తి ఉందంటుండు కానీ ఆయనకు సొంత కారు లేదంట.. చేతిలో ఒక్క రూపాయి లేదని మల్లారెడ్డి తన ఎన్నికల అఫిడవిట్ (Affidavit)లో తెలిపాడు.

మేడ్చల్ (Medchal) అభ్యర్థిగా నిలిచిన మల్లారెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశాడు. ఈ సందర్భంగా ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో అతడి ఆస్తిపాస్తులు, కేసుల వివరాలు పరిశీలించగా.. సొంత కారు లేదని పేర్కొన్నాడు. ఇక చేతిలో ఒక్క రూపాయి కూడా లేదని తెలిపారు. అయితే తనకు ఆస్తులు (Assets) మాత్రం రూ.95.95 కోట్లకు పైగా ఉన్నట్టు పేర్కొన్నాడు. కాకపోతే చేతిలో నగదు (Cash) రూపంలో రూపాయి లేదని అఫిడవిట్ లో పొందుపర్చారు. పలు బ్యాంకుల్లో రూ.7.5 కోట్ల అప్పులు ఉన్నాయని వెల్లడించారు.

భారీగా భూములు
అఫిడవిట్ ను మరింత పరిశీలించగా భూముల (Lands) వివరాలు భారీగా పొందుపర్చారు. మేడ్చల్ జిల్లాలోని సూరారం, కండ్లకోయ, ధూలపల్లి, జీడిమెట్ల, గుండ్లపోచంపల్లి, గుండపోచారం గ్రామాల్లో వ్యవసాయ భూములు, మైసమ్మగూడ, ఫిర్జాదీగూడ, బోయిన్ పల్లి, కొంపల్లి, ఆబిడ్స్ లో వాణిజ్య భవనాలు ఉన్నాయని వెల్లడించారు. మల్లారెడ్డి (Mallareddy) పేరి పేరిట రూ.41,40,10,776 విలువైన స్థిరాస్తులు ఉండగా.. భార్య కల్పన పేరిట రూ.38,69,25,565, డిపెండెంట్ పేరు మీద రూ.10,14,72,400 విలువైన స్థిరాస్తులు ఉన్నాయని, చరాస్తుల విలువ రూ.5,70,64,666 ఉన్నట్లు అఫిడవిట్ లో మల్లారెడ్డి పొందుపర్చారు.

గుర్రుగా ఓటర్లు
కాగా, మల్లారెడ్డి ఏది చేసినా సంచలనం అవుతోంది. ఆయన మాటలు.. చేష్టలు అన్నీ వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు అతడి ఎన్నికల అఫిడవిట్ కూడా వైరల్ (Viral)గా మారింది. కోట్ల ఆస్తులు, వందల ఎకరాల భూములు ఉన్నాయని చెప్పే మల్లారెడ్డికి పాపం సొంత కారు లేదా అని సోషల్ మీడియాలో (Social Media) నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా మేడ్చల్ నుంచి పోటీ చేస్తున్న మల్లారెడ్డికి ఈసారి ఫలితం ప్రతికూలంగా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గానికి ఏమీ చేయకపోవడం.. అవినీతి ఆరోపణలు, ఇతరులపై కక్ష రాజకీయాలు చేయడం వంటివి మల్లారెడ్డికి వ్యతిరేక ఓట్లు భారీగా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. డిసెంబర్ 3న అతడి భవితవ్యం (Results) ఏమిటో తేలనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button