తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Unhelathy: పార్టీ నాయకత్వానికి అనారోగ్యం.. గులాబీ పార్టీలో నిస్తేజం

అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి (BRS Party) ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలో ఉన్న గులాబీ పార్టీకి మరో తలనొప్పి వచ్చి పడింది. పార్టీ అధినేత మొదలుకుని ఎమ్మెల్యేలు (MLAs), సీనియర్ నాయకులు అంతా అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఫలితాలు వెల్లడై దాదాపు వారం కావొస్తున్నా ఆ ఓటమి నుంచి తేరుకోని గులాబీ దళానికి పార్టీ నాయకుల అనారోగ్యం వార్త కలవరపరుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ (KCR) గాయం అందరినీ కలవపరచగా.. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy), మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు (Kalvakuntla Vidyasagar Rao) కూడా అస్వస్థతకు గురయ్యారు.

Also Read ప్రొఫెసర్ కోదండ రామ్ కు ఏ పదవి? కాంగ్రెస్ మదిలో ఏముంది?

ఎర్రవెల్లి ఫామ్ హౌస్ (Farmhouse)లో కిందపడి గాయపడిన కేసీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో రెండు నెలల దాకా ఆయన కోలుకునే పరిస్థితి లేదు. ఇక బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం కూడా అస్వస్థతకు గురయ్యారు. కేసీఆర్ ను పరామర్శించడానికి ఆస్పత్రికి రాగా ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నారు. వీల్ చైర్ (Wheel Chair) ద్వారా ఆస్పత్రిలోకి రావడం కలవరం పెట్టింది. ఇలా ఉండగానే కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అస్వస్థతకు గురయ్యారు. ఇలా ఒకేసారి ముగ్గురు కీలక నాయకులు అనారోగ్య పాలవడంతో గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాతి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఒక విధమైన భావోద్వేగ వాతావరణం ఏర్పడింది. ఎవరి ముఖం చూసినా ముభావంగా ఉంటోంది.

Also Read విరిగిన ఎముక.. 2 నెలలు మంచానికే కేసీఆర్

ఇలాంటి సమయంలో పెద్దదిక్కుగా ఉన్న పార్టీ నాయకత్వం (Leadership) అండగా నిలుస్తుందనుకుంటే ఇలా అనారోగ్యం చెందడం పార్టీ శ్రేణుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. తమకు మార్గనిర్దేశం చేసే నాయకత్వం ఇలా అనారోగ్యం పాలవడం బీఆర్ఎస్ పార్టీని ఒంటరిని చేస్తోంది. పార్టీ మార్గనిర్దేశం (Direction) లేకపోవడంతో నాయకులు, కార్యకర్తలు దిక్కుతోచని వారు అవుతున్నారు. తమ భవిష్యత్ ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితిలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఒక భరోసా.. అండ కావాల్సిన అవసరం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button