తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Congress ‘తాగుబోతు’ కారు నడిపితే ఇట్లే ఉంటది.. కాంగ్రెస్ వీడియో వైరల్

అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) దూసుకెళ్తోంది. పార్టీ అగ్ర నాయకులు, ఎమ్మెల్యే అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ (BRS Party) చేసిన తప్పులు, అన్యాయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. పార్టీ యంత్రాంగం క్షేత్రస్థాయిలో అలా చేస్తుంటే.. పార్టీ సోషల్ మీడియా (Social Media) రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తోంది. సీఎం కేసీఆర్ (KCR) దుర్మార్గ పాలనను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తోంది. వీడియో.. పోస్టర్లు, పాటలు ఇలా తీరొక్క రీతిన చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీమ్ పని చేస్తోంది. తాజాగా విడుదల చేసిన ఓ వీడియో వైరల్ (Viral)గా మారింది. గులాబీ రంగు కారు దూసుకుంటూ వస్తూ అడ్డువచ్చిన ప్రజలను ఢీకొంటూ… గ్రామాలు, రోడ్లపై బీభత్సం సృష్టిస్తూ వీడియో (Video) ఉంది.

ప్రస్తుతం సీఎం కేసీఆర్ పాలన ఇష్టారాజ్యంగా ఉందనే అర్థాన్నిచ్చేలా ఈ వీడియో రూపొందించారు. ‘ఒక తాగుబోతు కారు (Car) నడుపుతే ఇలానే ఉంటది. పదేళ్ల అహంకారానికి చరమ గీతం పాడుదాం’ అని రాసి వీడియోను కాంగ్రెస్ పార్టీ పోస్టు చేసింది. వీడియోలో కారు దూసుకుంటూ వెళ్లి రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలపై బురద చల్లుకుంటూ వెళ్తుంది. ఈ క్రమంలోనే రైతు ఆత్మహత్యలు, కాళేశ్వరం అవినీతి, నిరుద్యోగం, రాష్ట్ర అప్పులు (Debts) వంటి అంశాలను ప్రస్తావిస్తూ వీడియో ఉంది. ఈ వీడియోను ప్రజలను ఆలోచింపజేస్తోంది. ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను కళ్లకు కట్టినట్టు రూపొందించిన ఈ వీడియో ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button