తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Doctor MLAs: రోగాలు నయం చేసే వైద్యులు ఎమ్మెల్యేలుగా ఎన్నిక..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) అత్యధికంగా విద్యావంతులే ఎన్నికయ్యారు. ప్రజల రోగాలు నయం చేసే వైద్యులు ఇప్పుడు ప్రజల సమస్యలు నయం చేసే పనిలో దిగారు. వైద్యులుగా రాణిస్తున్న డాక్టర్లు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఎన్నికై ప్రత్యేకత చాటారు. అసెంబ్లీ ఎన్నికల్లో 15 మంది వైద్యులు (Doctors) విజయం సాధించి రికార్డు నెలకొల్పారు. కొందరు గతంలోనే ఎమ్మెల్యేలుగా ఎన్నికవగా.. తాజా ఎన్నికల్లో మరికొందరు డాక్టర్లు చట్టసభకు ఎన్నికయ్యారు. వీరిలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) 11 మంది ఎన్నికవగా.. ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ (BRS Party) తరఫున.. ఒకరు బీజేపీ నుంచి గెలుపొందారు. మరి వారెవరో తెలుసుకోండి.

Also Read జిల్లాలవారీగా ఎన్నికైన ఎమ్మెల్యేలు వీరే..

డాక్టర్ ఎమ్మెల్యేలు వీరే..

మహబూబాబాద్ (ఎస్టీ): డాక్టర్ మురళీ నాయక్ (కాంగ్రెస్)
డోర్నకల్ (ఎస్టీ): డాక్టర్ జటోత్ రామచంద్రు నాయక్ (కాంగ్రెస్)
మానకొండూర్ (ఎస్సీ): డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (కాంగ్రెస్)
జగిత్యాల: డాక్టర్ సంజయ్ కుమార్ (బీఆర్ఎస్ పార్టీ)
కోరుట్ల: డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ (బీఆర్ఎస్ పార్టీ)
నారాయణపేట: డాక్టర్ చిట్టెం పర్ణిక (కాంగ్రెస్)
అచ్చంపేట (ఎస్సీ): డాక్టర్ వంశీకృష్ణ (కాంగ్రెస్)
నాగర్ కర్నూల్: డాక్టర్ కూచకుళ్ల రాజేశ్ రెడ్డి (కాంగ్రెస్)
మెదక్: డాక్టర్ మైనంపల్లి రోహిత్ (కాంగ్రెస్)
నారాయణఖేడ్: డాక్టర్ పట్లోళ్ల సంజీవ్ రెడ్డి (కాంగ్రెస్)
చెన్నూరు: డాక్టర్ గడ్డం వివేక్ (కాంగ్రెస్)
సిర్పూర్: డాక్టర్ పాల్వాయి హరీశ్ బాబు (బీజేపీ)
భద్రాచలం (ఎస్టీ): డాక్టర్ తెల్లం వెంకట్రావ్ (బీఆర్ఎస్ పార్టీ)
సత్తుపల్లి (ఎస్సీ): డాక్టర్ మట్టా రాగమయి (కాంగ్రెస్)
నిజామాబాద్ రూరల్: డాక్టర్ భూపతిరెడ్డి (కాంగ్రెస్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button