తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Glass Symbol పవన్ కల్యాణ్ కు ఈసీ షాక్.. గ్లాస్ గుర్తు పాయే..

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. ఆ పార్టీకి (JanaSena Party) కేటాయించిన గ్లాస్ (Glass Symbol) గుర్తు ఎన్నికల సంఘం రిజర్వ్ చేయకుండా ఫ్రీ గుర్తు జాబితాలో ప్రకటించింది. తెలంగాణలో జనసేన పార్టీ గుర్తింపు పొందకపోవడంతో ఆ గుర్తును రిజర్వ్ చేయలేదు. గాజు గ్లాసు ఫ్రీ సింబల్ జాబితాలో ఈసీ ఉంచింది. ఇప్పుడు ఆ గాజు గ్లాస్ గుర్తు ఇతర అభ్యర్థులకు కేటాయించే అవకాశం ఉంది. ఈ మేరకు ఎన్నికల సంఘం (Election Commission) ఓ ప్రకటన విడుదల చేసింది.

చదవండి: Diwali ఏపీ మాదిరే తెలంగాణ.. దీపావళి సెలవులో మార్పు

బలవంతపు పొత్తు
ఏపీలో కొనసాగుతున్న పొత్తును తెలంగాణలో (Telangana) కొనసాగించాలని బీజేపీ (BJP) భావించి జనసేనతో కలిసి పోటీ చేస్తోంది. ఇక్కడ పొత్తు కొనసాగించడానికి సుముఖంగా లేకపోయినప్పటికీ బీజేపీ అధిష్టానం నిర్ణయంతో పవన్ అంగీకరించాడు. మొత్తం 119 స్థానాల్లో జనసేన కేవలం 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ మేరకు అభ్యర్థులను ఖరారు చేసింది.

బలం లేని చోట పోటీ
కాగా, బలం లేని చోట పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం పవన్ (Pawan Kalyan)కు అలవాటే. 2014 ఏపీ ఎన్నికల్లో రెండో చోట్ల పోటీ చేసి భారీ పరాజయం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో జనసేన ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఏపీలోనే (AP) దిక్కు లేని పార్టీ తెలంగాణలో పోటీ చేయడం విమర్శలకు తావిచ్చింది. ఈ పొత్తు ఇరు పార్టీలకు ఇష్టం లేకున్నా ఢిల్లీ పెద్దల ఆదేశంతో బలవంతంగా ఏర్పడింది. మరి పొత్తు విజయవంతమయ్యిందో లేదో అనేది డిసెంబర్ 3వ తేదీన తెలియనుంది.

చదవండి: కోహ్లీ-అనుష్క ఆస్పత్రికి ఎందుకు వెళ్లారు? మరో గుడ్ న్యూస్ ఉంటుందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button