తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఆయన కీలక విషయాలు వెల్లడించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ ఎంతో ముఖ్యమైనది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా గత ప్రభుత్వం 19 లక్షల ఎకరాలకు నీరిచ్చే ఆలోచన చేసింది. కానీ ఇప్పుడు మేడిగడ్డ కుంగిపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. మొదట్నించీ ఈ ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు కనిపిస్తున్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కారణమైంది. వందేళ్లు ఉండాల్సిన బ్యారేజీ.. కేవలం మూడేళ్లలోనే కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి బీఆర్ఎస్సే కారణం’ అని ఉత్తమ్ మండిపడ్డారు.

ALSO READ: మేడారం జాతరకు సర్వం సన్నద్ధం.. అందుబాటులోకి హెలికాప్టర్ సేవలు

మొదట ఈ బ్యారేజీ నిర్మాణం కోసం రూ. 1800 కోట్లతో టెండర్లు పిలిచారు. కానీ ఆ తర్వాత అంచనా వ్యయాన్ని రూ. 4,500 కోట్లకు తీసుకెళ్లారు. దీనిని బట్టి ఇందులో ఎంత అవినీతి జరిగిందో ఊహించుకోవచ్చన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఏటా 25 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. దీనిని బట్టి భారతదేశంలోనే ఎక్కడ జరగని అవినీతి ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిందని ఉత్తమ్ ఆరోపించారు. ఈ మేరకు విజిలెన్స్ కమిటీ విచారణలో కీలక విషయాలు తెలిశాయన్నారు. అంతేకాదు, మేడిగడ్డతో పాటు అన్నారం బ్యారేజీకి కూడా ముప్పు పొంచి ఉందని, అది కూడా కుంగిపోయే ప్రమాదం ఉందని తేలిందన్నారు. మరోవైపు.. ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ స్పందించింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఉత్తమ్ చెప్పినవన్నీ అబద్ధాలనేని మాజీ మంత్రి హరీశ్ తిప్పికొట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button