తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Kaleshwaram Project: కాళేశ్వరం కల్వకుంట్ల ఫ్యామిలీకి ఏటీఎం … డ్యామేజీనే మైలేజీగా వాడుకుంటున్న కాంగ్రెస్

తెలంగాణ రాష్ట్రానికి ముచ్చటగా మూడో సారి సీఎం కావాలని కేసీఆర్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఎక్కడికి వెళ్లిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పుకునే సీఎం ఇప్పుడు దాని ఊసే తియ్యడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ అద్భుతమని, లక్ష కోట్లతో కట్టిన ఈ ప్రాజెక్టుతో ఏటా 360 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి 36 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నమని అనేక సందర్భాల్లో చెప్పుకున్నారు. కానీ గతేడాది కాళేశ్వరం పంప్ హౌస్ మునిగి మోటార్లు పాడాయ్యాయి. ఇటీవల మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు పగుళ్లు ఏర్పడటంతో కేసీఆర్ ఇప్పుడా ప్రాజెక్టు గురించిన ప్రస్తావనే తేవడంలేదు.

ముంపు బాధితులను పట్టించుకొని బీఆర్ఎస్

కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల నష్టపోతున్న ముంపు రైతులకు ఎకరానికి 30 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని, ఎకరానికి 20 లక్షలు చెల్లించి ముంపు భూములను ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ కాళేశ్వరం కట్టకముందు కూడా పంటలు మునిగాయంటూ బాల్క సుమన్, పుట్ట మధు గత నాలుగేండ్లుగా రైతుల డిమాండ్లను కొట్టిపారేశారు. కానీ ఇప్పుడు ఎన్నికలు రావడంతో నష్టపరిహారం ఇస్తామంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేసిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు నమ్మడానికి సిద్దంగా లేరు. అలాగే బ్యాక్ వాటర్ సమస్యపై సీఎం సరైన హామీ ఇవ్వకపోవడంతో నాయకులిద్దరూ రైతులకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థులకు కలిసి వచ్చేనా?

ఈ ప్రాజెక్టుకు అటూ ఇటూగా గోదావరి ఒడ్డున ఉన్న మంథని, పెద్దపల్లి, మందమర్రి పట్టణాల్లో జరిగిన బీఆర్ఎస్ సభల్లో కూడా ఈ ప్రాజెక్టు పేరునే ఎత్తలేదు. అందువల్ల ఎలక్షన్స్ ముందు జరిగిన ఈ సంఘటన వల్ల బీఆర్ఎస్ అభ్యర్థులైన బాల్క సుమన్ కు చెన్నూరు లో, పుట్ట మధుకు మంథనిలో గట్టి ఎదురు దెబ్బ తగలనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదే సమయంలో చెన్నూరు, మంథని కాంగ్రెస్ అభ్యర్థులు డా. జి వివేకానంద, దుద్దిళ్ల శ్రీధర్ బాబు లు దొరికిన అవకాశాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రచారానికి ఎక్కడికి వెళ్లిన ప్రాజెక్టులోని లోపాలను ఎత్తిచూపుతున్నారు.

కోట్లు దండుకున్న కల్వకుంట్ల ఫ్యామిలీ

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం పై బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ నాయకులు గట్టిగానే నిలదీస్తున్నారు. మైక్ ల ముందు ప్రాజెక్ట్ గురించి ప్రతిసారి ఊదరగొట్టిన సీఎం ఇప్పుడు నోరు మెదపడం లేదంటూ మండిపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో కోట్లకు కోట్లు మింగేశారని కల్వకుంట్ల ఫ్యామిలీకి ఏటీఎం లాగా మారిందని విమర్శించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ తన తప్పును ఒప్పుకోని ప్రజలకు క్షమపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మధ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీ ఏకంగా మేడిగడ్డ వెళ్లి మరీ పరిస్థితిని తెలుసుకొని కేసీఆర్ పై నిప్పులు చేరిగారు.

నాణ్యత పట్ల అనుమానాలు

కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని లోపాలు ఈ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు మైనస్ పాయింట్ అనే చెప్పాలి. ఈ బ్యారేజ్ కుంగిపోవడం పై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో పాటు ప్రాజెక్టు నాణ్యత పట్ల అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రాజెక్ట్ నిర్మించి కేవలం నాలుగు సంవత్సరాలకే కుంగిపోవడం ఏమిటని కేసీఆర్ పై మండిపడుతున్నారు. ఇంత జరిగిన కేసీఆర్ నోరు విప్పకపోవడంతో నిజంగానే ఇందులో అవినీతి జరిగి ఉండచ్చని ప్రజలు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button