తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Minister Seethakka: మేడారానికి పోటెత్తిన భక్తులు.. అన్ని ఏర్పాట్లు చేశామన్న ప్రభుత్వం

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి సీతక్క మేడారంలోనే ఉండి జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రతిసారీ తల్లులను వనంలో నుంచి గద్దెలపైకి తీసుకొచ్చేటప్పుడు తాను ఉంటున్నానని తెలిపారు. ఈసారి తన ఆధ్వర్యంలో తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. అలాగే.. మేడారం వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అంతేకాకుండా.. భక్తులు తల్లులను దర్శించుకునే సమయంలో క్యూలైనల్లో తాగునీటి బాటిళ్లు ఇస్తున్నట్లు తెలిపారు. మేడారంలో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. రోడ్లు, బస్సులు, తాగునీరు అన్ని సౌకర్యాలు చేశామన్నారు. మరోవైపు.. చిన్నపిల్లలు ఉన్నట్లైతే వెంట మంచినీటి బాటిళ్లను తెచ్చుకోవాలని మంత్రి సూచించారు. ఇక ఈరోజు సాయంత్రం సారలమ్మ గద్దెపై కొలువుతీరనుందని.. ఈ మహా ఘట్టం కోసం ఎంతో ఉద్వేగంతో ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

Also read: Kumaraswamy: సీఎంతో హీరోయిన్ రెండో పెళ్లి.. నాలుగేళ్లు రహస్య కాపురం

మేడారం మహా జాతరకు రాష్ట్ర నలమూలల నుంచే కాకుండా.. పలు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున వస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు. మరోవైపు.. దేవతలను గద్దెలపైకి తీసుకొని వచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులు తొందరపడకుండా తల్లుల దర్శనం చేసుకోవాలని చెప్పారు. ఇదిలా ఉంటే.. జాతరకు వచ్చే భక్తులకు మంత్రి సీతక్క కీలక సూచన చేశారు. ముఖ్యంగా డ్రైవింగ్ చేసే భక్తులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ప్రమాదాల బారిన పడొద్దని సూచించారు. అంతేకాకుండా.. జాతరకు వచ్చేటప్పుడు ప్లాస్టిక్ రహితంగా రావాలని చెప్పారు.

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు జాతర ఘనంగా కొనసాగనుంది. జాతరలో ముఖ్య ఘట్టమైన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఈరోజు గద్దెలపైకి చేరుకుంటారు. మధ్యాహ్నం పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకోగా.. సాయంత్రం కన్నెపల్లి నుంచి గద్దెపైకి సారలమ్మను తీసుకురానున్నారు. రేపు చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి రానుంది. ఫిబ్రవరి 23న గద్దెలపై కొలువుదీరని తల్లులకు పూజలు నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 24న దేవతలు వన ప్రవేశం చేయడంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button