తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Siddaramaiah: మాజీ మంత్రి కేటీఆర్‌కు కర్ణాటక సీఎం కౌంటర్

ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇస్తాం.. అంత మాత్రాన ఫ్రీగా ఇవ్వాలా? మాకు ఇవ్వాలనే ఉంది. అయితే డబ్బులు లేవు’ అని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అసెంబ్లీలో మాట్లాడారంటూ వైరల్ అవుతున్న ఓ వీడియోను మాజీ మంత్రి కేటీఆర్‌ రీ ట్వీట్ చేశారు. తన ఎక్స్ ఖాతా వేదికగా ఆ వీడియోను పోస్టు చేసి కాంగ్రెస్ సర్కారుపై ప్రశ్నలు సంధించారు. ‘ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి డబ్బులు లేవని సిద్దరామయ్య అంటున్నారు. అలా హామీల ప్రకటన ఇచ్చే ముందు ఆలోచన చేయరా? తెలంగాణ భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుందా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.

ALSO READ: కర్ణాటక సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యలు… కేటీఆర్ X లో కౌంటర్

ఏది ఫేక్.. ఏది ఎడిట్ చేశారో తెలియదా?

కేటీఆర్​ చేసిన ఈ ట్వీట్​పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. సోషల్‌ మీడియాలో తనను విమర్శిస్తూ ఓ వీడియోను షేర్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్‌కు కర్ణాటక సీఎం కౌంటర్ ఇచ్చారు. ‘తెలంగాణ ఎన్నికల్లో మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలుసా? అది తెలుసుకుంటే మంచిది. బీజేపీ ఎడిట్ చేసిన వీడియోను మీ పార్టీ సర్క్యులేట్ చేస్తుంది. మీ బీఆర్ఎస్, బీజేపీకి చెందిన పార్టీ అని ప్రజలకు తెలుసు. బీఆర్ఎస్ ఫర్పెక్ట్ బీ టీమ్. మీకు ఏది ఫేక్.. ఏది ఎడిట్ చేశారో ధ్రువీకరించడం కూడా తెలియదా? ’ అని సిద్ధరామయ్య ట్వీట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button