తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Manakondur: అవ్.. కరీంనగర్ పిల్లనే పెళ్లి చేసుకున్నా: సీఎం కేసీఆర్

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కరీంనగర్ (Karimnagar)తో తనకు అనుబంధాన్ని పంచుకుంటూ పలు విషయాలు పంచుకున్నారు. తనకు కరీంనగర్ కు ఓ లింక్ ఉందని.. అది నిజమేనని తెలిపారు. తాను కరీంనగర్ పిల్లనే పెళ్లి (Marriage) చేసుకున్నట్లు చెప్పి సభికులను నవ్వించారు. ఈ సరదా సన్నివేశానికి కరీంనగర్ జిల్లా మానకొండూరు బహిరంగ సభ వేదికగా మారింది.

చదవండి: సీఎం కేసీఆర్ ప్రగతిరథం బస్సులో తనిఖీలు

ఎన్నికల ప్రచారంలో (Election Campaign) భాగంగా పార్టీ అభ్యర్థి రసమయి బాలకిషన్ (Rasamayi Balakishan)కు మద్దతుగా మానకొండూరులో (Manakondur) కేసీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘కరీంనగర్ కు నాకు ఏదో శ్రుతి ఉంది. కరీంనగర్ భీముడు కమలాకర్ మొన్న అన్నాడు. మీకు కరీంనగర్ కు ఏదో లింక్ ఉన్నది అన్నాడు. లింక్ అయితే ఉన్నదనుకో. ఇక్కడి నుంచే పెళ్లి చేసుకున్నా. కరీంనగర్ పిల్లనే పెళ్లి చేసుకున్నా. నేను ఇక్కడకు ఎప్పుడు వచ్చినా ఏదో ఒక పథకం (Scheme) ప్రకటిస్తున్నా’ అని తెలిపారు.

చదవండి: బీజేపీకి వరుస షాక్ లు.. మరో ఇద్దరు కీలక నాయకులు జంప్

ఆటో కార్మికులకు శుభవార్త
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికులకు (Auto Workers) శుభవార్త ప్రకటించారు. మళ్లీ అధికారంలోకి రాగానే ఆటో కార్మికుల ఫిట్ నెస్ పన్ను (Fitness Tax) రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. ‘ఆటోరిక్షా పోరగాళ్లు ఉన్నారు. వాళ్లకు నేను ఇవాళ శుభవార్త (Good News) చెబుతున్నా. వారికి ఆదాయం వచ్చేదే తక్కువ. మోదీ విపరీతంగా డీజిల్ ధర పెంచేటట్టు చేసిండు. ఆటో కార్మికుల వద్ద ముక్కు పిండి పన్ను వసూళ్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే పన్ను రద్దు చేసినాం. రూపాయి పన్ను లేదు. ఇప్పుడు వాళ్లకు ఏడాదికోసారి ఫిట్ నెస్ చేసుకోవాల్సిన బాధ ఉంది. ఫిట్ నెస్ కు వెళ్లితే రూ.700, సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.500 చార్జీ (Charge) చేస్తున్నారు. మొత్తం కలిపితే రూ.1,200 అవుతుంది. మరోసారి మేం అధికారంలోకి రాగానే ఫిట్ నెస్ పన్ను రద్దు చేస్తామని ప్రకటిస్తున్నా’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button