తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

KCR Assets సీఎం కేసీఆర్ నిజంగా దొరనే! ఆయన ఆస్తులు ఎంతో తెలుసా..?

తెలంగాణలో నామినేషన్లు జోరుగా సాగుతున్నాయి. రేపటితో నామినేషన్ల గడువు ముగుస్తుండడం, మంచి రోజు కావడంతో గురువారం పెద్ద ఎత్తున అభ్యర్థులు (Candidates) తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ కూడా తన నామినేషన్ ను సమర్పించారు. అయితే నామినేషన్ పత్రాలకు తోడు ఆయన జతపర్చిన ఎన్నికల అఫిడవిట్ (Affidavit) ఆసక్తికరంగా మారింది. ఆస్తులు, కేసులు వంటి వివరాలతో అఫిడవిట్ ఉంటుంది. ఆ పత్రం పరిశీలించగా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం కేసీఆర్ (KCR)కు తన పేరు మీద గుంట భూమి కూడా లేదట.. ఇక సొంత కారు (Car) కూడా లేదని అఫిడవిట్ లో పేర్కొన్నారు. కాకపోతే ఆయన పేరిట రూ.58.7 కోట్ల ఆస్తులు (Assets) ఉన్నట్టు మాత్రం చెప్పారు. ఈ అఫిడవిట్ వివరాలు ప్రస్తుతం వైరల్ గా మారింది.

గజ్వేల్ (Gajwel), కామారెడ్డి (Kamareddy) నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్ రెండు చోట్ల ఒకేరోజు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయన సమర్పించిన అఫిడవిట్ లో ఉన్న వివరాల ప్రకారం.. కేసీఆర్ కుటుంబానికి మొత్తం 53.30 ఎకరాల పొలం ఉంది. 9.36 ఎకరాల మేర వ్యవసాయేతర భూమి (Agriculture Land) ఉందని అఫిడవిట్ లో పొందుపర్చారు.

చదవండి: ‘తాగుబోతు’ కారు నడిపితే ఇట్లే ఉంటది.. కాంగ్రెస్ వీడియో వైరల్

రూ.17.83 కోట్ల విలువైన స్థిర ఆస్తులు, రూ.9.67 కోట్ల చరాస్తులు తన పేరిట ఉన్నాయని సీఎం కేసీఆర్ తన అఫిడవిట్ లో తెలిపారు. తన భార్య శోభ పేరిట రూ.7.78 కోట్ల చరాస్తులు, ఉమ్మడి ఆస్తిగా రూ.9.81 కోట్ల మేర చరాస్తులు ఉన్నాయని అఫిడవిట్ లో వెల్లడించారు. అప్పుల (Debts) విషయానికి వస్తే కేసీఆర్ పేరిట రూ.17.27 కోట్ల అప్పు ఉండగా.. కుటుంబానికి రూ.7.23 కోట్ల అప్పు ఉందని పేర్కొన్నారు.

బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు, సేవింగ్స్ కలిపి రూ.11.16 కోట్లు ఉన్నాయి. సీఎం కేసీఆర్ భార్య చేతిలో మాత్రం భారీగా నగదు (Cash) ఉంది. రూ.6.29 కోట్ల నగదు ఉందని.. ఇక బంగారు (Gold) ఆభరణాలు 2.8 కిలోలు ఉన్నాయని అఫిడవిట్ లో ఉంది.

చదవండి: పాలమ్మిండు.. పూలమ్మిండు.. కానీ సొంత కారు కొనలేదు

వాహనాల (Vehicles) విషయానికి వస్తే సీఎం కేసీఆర్ పేరిట సొంత కారు మాత్రం లేదు. కాకపోతే వ్యవసాయానికి సంబంధించిన వాహనాలు మాత్రం 14 ఉన్నాయి. వాటిలో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, జేసీబీ వంటి వాహనాలు ఉండగా.. వాటి విలువ సుమారు రూ.కోటి 16 లక్షలుగా అఫిడవిట్ లో సీఎం కేసీఆర్ పొందుపర్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button