తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Telangana CM: ఓం బిర్లాతో రేవంత్ భేటీ… లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా

తాను లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తన చివరి శ్వాస వరకు అటు కొడంగల్… ఇటు మల్కాజ్‌గిరి తన ఊపిరి అని ట్వీట్ చేశారు. లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం ఆయన ట్వీట్ చేశారు. లోక్ సభ సభ్యత్వానికి నేడు రాజీనామా చేశానని… ఈ రాజీనామా తన ఎంపీ పదవికి మాత్రమే… తన మనసులో మల్కాజ్‌గిరి ప్రజల స్థానం శాశ్వతమని తెలిపారు. ప్రశ్నించే గొంతుకగా తనను పార్లమెంటుకు పంపిన ఇక్కడి ప్రజలతో అనుబంధం శాశ్వతమని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో కొడంగల్‌కు ఎంత ప్రత్యేకత ఉందో… మల్కాజిగిరికీ అంతే ప్రత్యేకత ఉందన్నారు. తనను దేశానికి పరిచయం చేసిన ఘనత మల్కాజిగిరి ప్రజలదే అన్నారు.

Also Read: అధికారంలోకి కాంగ్రెస్ … అవినీతి అధికారులకు భయం పట్టుకుందా?

ఏ విశ్వాసంతో.. ఏ అభిమానంతో… తనను గెలిపించారో అయిదేళ్లుగా మీరు ఆశించిన ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన పోరాడినట్లు తెలిపారు. విస్తృత బాధ్యతల నేపథ్యంలో వ్యక్తిగతంగా కొన్నిసార్లు అనుకున్నంత సమయం ఇవ్వలేకపోయి ఉండవచ్చునని, అలాంటి సమయంలో తన పరిస్థితిని మల్కాజ్‌గిరి ప్రజలు సహృదయంతో అర్థం చేసుకున్నట్లు తెలిపారు. దేశ రక్షణ కోసం పంపించినట్లుగా తెలంగాణ రక్షణ కోసం తనను గెలిపించి పంపించారన్నారు. మల్కాజ్‌గిరి ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. మల్కాజ్ గిరికి ఎప్పటికీ రుణపడి ఉంటానని X లో ట్వీట్ చేశారు.

Also Read: సోనియా గాంధీకి సీఎం రేవంత్ విషెస్.. ప్రముఖుల శుభాకాంక్షలు

లోక్ సభ సభాపతి ఓం బిర్లాతో రేవంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. సభాపతితో సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ వ్యవహారాల మాజీ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ కూడా ఉన్నారు. సభాపతికి రాజీనామాను సమర్పించిన అనంతరం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ బయలుదేరుతున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త కేబినెట్‌లో శాఖల కేటాయింపు, మరో ఆరుగురు కేబినెట్ ఎంపికపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button