తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

టికెట్లు అందరికీ ఇచ్చేశారు.. ఇక కాంగ్రెస్ గెలుపే ఆలస్యం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Assembly Elections) కాంగ్రెస్ పార్టీ దశలవారీగా అభ్యర్థులను ప్రకటించగా గురువారం రాత్రి చివరి జాబితాను విడుదల చేసింది. మిగిలిన ఐదు నియోజకవర్గాలకు కూడా ప్రకటించడంతో 118 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన పూర్తయ్యింది. పొత్తులో భాగంగా సీపీఐకి ఓ సీటు కేటాయించిన విషయం తెలిసిందే. తాజాగా వెలువడిన జాబితాలో పటాన్ చెరు-కట్టా శ్రీనివాస్ గౌడ్, చార్మినార్- మహ్మద్ ముజీబుల్లా షరీఫ్, మిర్యాలగూడ- బత్తుల లక్ష్మారెడ్డి, సూర్యాపేట- రాంరెడ్డి దామోదర్ రెడ్డి, తుంగతుర్తి- మందుల శ్యామూల్ ఉన్నారు.

చదవండి: ‘తాగుబోతు’ కారు నడిపితే ఇట్లే ఉంటది.. కాంగ్రెస్ వీడియో వైరల్

అందరికీ బీ ఫారాలు
నామినేషన్ గడువు శుక్రవారంతో ముగుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) మిగిలిన వారందరికీ బీ ఫారాలు పంపించింది. వారంతా నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కాగా, పటాన్ చెరు టికెట్ నీలం మధు ముదిరాజ్ కు ఇవ్వగా తాజాగా అతడి స్థానంలో కట్టా శ్రీనివాస్ గౌడ్ కు పార్టీ అవకాశం కల్పించింది.

హోరెత్తనున్న ప్రచారం
నామినేషన్లు ముగియనుండడంతో ఇక కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెట్టింది. అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. బీఆర్ఎస్ (BRS Party) ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూనే.. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో వివరిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) సారథ్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఫుల్ జోష్ లో ప్రచారంలో పాల్గొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button