తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Telangana: అధికారంలోకి కాంగ్రెస్ … అవినీతి అధికారులకు భయం పట్టుకుందా?

బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వచ్చేలా ఉన్నాయని ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతుంది. విద్యుత్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన నూతన సీఎం రేవంత్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలుస్తుంది. ఈ సమావేశానికి ట్రాన్స్ కో – జెన్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు హాజరుకావాల్సిందిగా క్యాబినెట్ భేటీ సందర్భంగానే విద్యుత్ శాఖ అధికారులకు స్పష్టం చేసినా.. ఆయన రివ్యూ మీటింగుకు హాజరు కాలేదు. మరోవైపు విద్యుత్ శాఖకు సంబంధించి 85 వేల కోట్లు అప్పు ఉన్నట్లు తెలుస్తుంది. నిజంగానే విద్యుత్ కోసం అప్పు చేశారా? లేక ఇందులో ఏమైనా అవినీతి జరిగిందా? పూర్తి వివరాలను తనకు అందించాలని ఈ సందర్బంగా రేవంత్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది.

Also Read: తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణం.. మార్గదర్శకాలు ఇవే

నిరాంతర విద్యుత్ అందించాలి

ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ… అధికారంలోకి కాంగ్రెస్ వస్తే తెలంగాణలో కరెంట్ కష్టాలు తప్పవంటూ ప్రచారం చేసిన నేపథ్యంలో .. బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచే ఆ శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అలాగే తెలంగాణ విద్యుత్ ను కర్ణాటకకు మళ్లీస్తారనే ప్రచారం కూడా బీఆర్ఎస్ నేతలు చేశారు. రాష్ట్రమంతటా గృహ, పారిశ్రామిక, వ్యవసాయ విద్యుత్‌ సరఫరాకు ఎలాంటి ఆటంకాల్లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగాలన్నదే తమ ప్రభుత్వ విధానమని, 24 గంటలూ నాణ్యమైన విద్యుత్‌ను అందించడానికి శాఖ పూర్తిస్థాయిలో సహకారం అందించాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతిలో భాగంగా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తామని ప్రకటించింది.

Also Read: నేడు కొలువుదీరనున్న కొత్త అసెంబ్లీ… ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ

భయంతోనే ఈ వికృత చేష్టలా?

మాసబ్ ట్యాంక్‌లోని పశుసంవర్థక శాఖల కార్యాలయంలో మాజీ ఓఎస్డీ కళ్యాణ్ హల్‌చల్ చేశారు. కార్యాలయంలోని ఫైల్స్ అన్ని చించేసి సంచుల్లో మూట కట్టి బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్టుగా ఆ శాఖ ఉద్యోగులు తెలిపారు. ప్రభుత్వం మారడంతో ఓల్డ్ ఫైల్స్ అన్ని చించేసి తీసుకెళ్లేందుకు ఆయన ప్రయత్నించారని ఉద్యోగులు తెలిపారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర కళ్యాణ్ ఓఎస్డీగా పనిచేశారు. అయితే ప్రస్తుతం ఓఎస్డీగా ఆయన పదవీ కాలం అయిపోయి నాలుగు రోజులు అయినా డిపార్ట్ మెంట్‌కు వచ్చి ఫైల్స్‌ను తీసుకెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతోపాటు గతంలో ఫర్నీచర్ కోనుగోళ్లలో కూడా ఆయన అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు సైతం ఆయనపై వచ్చాయి.

Also Read: సోనియా గాంధీకి సీఎం రేవంత్ విషెస్.. ప్రముఖుల శుభాకాంక్షలు

అవినీతి బయటకు వచ్చేనా?

మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం అమలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పై సమీక్ష నిర్వహించడం వంటివి చూస్తుంటే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను నెరవేర్చలనే కృత నిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇవే కాకుండా మిగిలిన హామీలను కూడా వీలైనంత త్వరగా నెరవేర్చలని కాంగ్రెస్ చూస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే వివిధ శాఖల్లో జరిగిన అవినీతిని కూడా బయటకు తీసే పనిలో కాంగ్రెస్ ఉన్నట్లు కనిపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేసు వేయడం, విద్యుత్ శాఖలో 85 వేల కోట్ల అప్పుపై ఆరాతీయడం ఇవ్వన్ని అవినీతిని వెలికితీయ్యడంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతికి పాల్పడిన అధికారులకు కూడా భయం పట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఎక్కడ తమ గుట్టు రట్టు అవుతుందనే ఉద్దేశ్యంతోనే అధికారులు ఇలా ప్రవర్తిస్తురనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button