తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TJS: ప్రొఫెసర్ కోదండ రామ్ కు ఏ పదవి? కాంగ్రెస్ మదిలో ఏముంది?

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో కాంగ్రెస్ పార్టీ (Congress Party) నాయకులు పదవులపై భారీ ఆశలు పెంచుకున్నారు. తొలి విడత మంత్రివర్గం ఏర్పాటు కాగా.. త్వరలోనే రెండో విడతలో మంత్రివర్గ విస్తరణ ఉండనుంది. అయితే ఎన్నికల్లో తమకు మద్దతు తెలిపిన సీపీఐతో పాటు తెలంగాణ జన సమితి (Telangana Jana Samithi) పార్టీలు కూడా పదవులు ఆశిస్తున్నాయి. ఆ పార్టీ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ కోదండ రామ్ (Kodandaram)కు ప్రభుత్వంలో ఎలాంటి స్థానం లభిస్తుందోననే ఆసక్తికర చర్చ మొదలైంది. కోదండ రామ్ కు పలానా పదవులు ఇస్తారని వార్తలు వస్తున్నాయి. రాజ్య సభ సభ్యత్వం, ప్రభుత్వ సలహాదారు లేదా టీఎస్ పీఎస్సీ చైర్మన్ తదితర పదవులు ఇస్తారనే చర్చ జరుగుతోంది.

Also Read బిల్లు కడుతారా.. మాల్ మూసేయాల్నా? బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేకు హెచ్చరిక

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ (Professor)గా రిటెరైన కోదండ రామ్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయన ప్రొఫెసర్ గా కొనసాగుతూనే తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ (KCR) సహాయంతో నడిపించారు. ఉద్యమంలో కేసీఆర్, కోదండ రామ్ ఇద్దరూ సమన్వయం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. స్వరాష్ట్ర ఆవిర్భావం అనంతరం కోదండ రామ్ కు కేసీఆర్ పదవి ఆఫర్ చేశారు. కానీ తనకు సముచిత స్థానం ఇవ్వలేదనే బాధతో కేసీఆర్ ఆఫర్ (Offer)ను తిరస్కరించారు. అనంతరం కేసీఆర్, కోదండ రామ్ మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. అనంతరం కోదండ రామ్ కేసీఆర్ కు వ్యతిరేకంగా ఒంటరి పోరాటం ప్రారంభించారు.

Also Read మాజీ సీఎం కేసీఆర్ కు తీవ్ర గాయం.. ఆందోళనలో పార్టీ నాయకులు

కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు తమ పార్టీలలో చేరాలని కోదండ రామ్ కు ఆహ్వానం పలికాయి. కానీ ఆయన ఏ పార్టీలో చేరకుండా ఆయనే తెలంగాణ జన సమితి అనే పార్టీని స్థాపించారు. ఉద్యమంలో విజయవంతమైన కోదండ రామ్ రాజకీయంగా సక్సెస్ కాలేకపోయారు. తాజా ఎన్నికల్లో తాను మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ గెలవడంతో కోదండ రామ్ దశ తిరిగింది. కేసీఆర్ ను నిలదీసిన వారిలో కోదండ రామ్ మొదట ఉంటారు. అలాంటి వ్యక్తిని గౌరవించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే కోదండ రామ్ కు రాజ్య సభ సభ్యత్వం ఇవ్వాలని.. లేదా ప్రభుత్వంలో సలహాదారుగా (Adviser) అవకాశం ఇవ్వాలనే చర్చ నడుస్తోంది. ప్రొఫెసర్ గా విశేష అనుభవం కలిగిన నాయకుడు కావడంతో టీఎస్ పీఎస్సీ (TSPSC) చైర్మన్ పదవికి కూడా కోదండ రామ్ ను పరిశీలిస్తున్నారు. అధిష్టానంతో చర్చించిన అనంతరం కోదండ రామ్ పదవిపై ఒక స్పష్టత రానుంది. కాకపోతే కోదండ రామ్ కు ఇప్పట్లో కాదని.. కొన్నాళ్ల తర్వాత పదవి లభిస్తుందనే చర్చ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button