తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Debts: తవ్వుతున్న కొద్దీ అప్పులు.. బండెడు భారం మోపిన కేసీఆర్

రాష్ట్ర విభజనతో తెలంగాణ (Telangana) రాష్ట్రం దాదాపు రూ.3 వేల కోట్ల మిగులుతో (Surplus) ఏర్పడింది. పదేళ్లకు ఆ పరిస్థితి తలకిందులయ్యింది. మిగులు పోయి అప్పుల గుదిబండ మోపైంది. ప్రస్తుతం తెలంగాణపై రూ.5 లక్షల కోట్లు అప్పు (Debts) ఉందని తెలుస్తోంది. దాదాపు పదేళ్ల పాటు పరిపాలించిన బీఆర్ఎస్ (BRS Party) ప్రభుత్వం ఇష్టారీతిన ఖర్చు చేయడంతో కొండంత అప్పు పేరుకుపోయింది. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో భారీగా అప్పులయ్యాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ భారం చూసి అవాక్కయ్యింది. శాఖల వారీగా లెక్కలు తీస్తే అప్పుల బొక్కలు వెలుగులోకి వస్తున్నాయి. దాచి పెట్టిన అప్పులు బయట పడుతున్నాయి. కానీ ఇన్నాళ్లు ఆ అప్పులను దాచిపెట్టి పరిపాలన సాగించడం గమనార్హం.

Also Read సీఎం ‘బెల్టు’ తీశాడు.. మందుబాబులకు ఇక చుక్కలే!

తవ్వుతున్న కొద్దీ కొత్త అప్పులు బయటపడుతుండడంతో కొత్త ప్రభుత్వం నివ్వెరపోతున్నది. ఇప్పటివరకు పౌరసరఫరా శాఖ (Civil Supplies) రూ.56 వేల కోట్లు, విద్యుత్ శాఖ (Power) రూ.81 వేల కోట్లు, డిస్కమ్స్ (Discoms) రూ.41 వేల కోట్లు వెలుగులోకి వచ్చాయి. ఒక్కొక్క శాఖలో వేల వేల కోట్ల అప్పులు ఉన్న విషయం బయటకు వస్తోంది. గత ప్రభుత్వం దాచిపెట్టిన వాటిని ప్రస్తుత ప్రభుత్వం తవ్వితీస్తోంది. దీంతో ఆ శాఖ అధికారులు వాస్తవ లెక్కలను ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు. ఇన్నేసి అప్పులు ఉన్నా కూడా గత పదేళ్లల్లో ఎక్కడా బయటకు పొక్కలేదు. ఈ అప్పుల విషయాలు ప్రధాన మీడియా (Media) ఏనాడు ప్రస్తావించిన పాపానపోలేదు.

Also Read ప్రజలకు గద్గద స్వరంతో కేసీఆర్ విజ్ణప్తి

బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రధాన మీడియా అంతా వంత పాడింది. ప్రభుత్వ గొప్పలు చెప్పుకుంటూ కథనాలు, ప్రసారాలు చేశాయి. కానీ ఏనాడు అప్పుల విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించలేదు. ప్రభుత్వం మారడం ద్వారా కేసీఆర్ (KCR) చేసిన అప్పుల కుప్ప కదులుతోంది. తమ పాలన అద్భుతంగా ఉందని కేసీఆర్, కేటీఆర్ (KTR) చేసినదంతా ఉత్తదేనని తెలుస్తోంది. సంపన్న రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసి కొండంత అప్పును మోపి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మోపిన అప్పులు ఎలా తీర్చాలని ప్రస్తుత ప్రభుత్వం మదనపడుతోంది. త్వరలోనే ఈ అప్పులకు సంబంధించిన విషయాలపై కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ప్రజల ముందు ఉంచనుంది. ఈ మేరకు శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు సిద్ధమైంది.

అప్పులు ఇలా (రూ.కోట్లలో)
– పౌర సరఫరాల శాఖ: 56,000
– విద్యుత్ సంస్థలు: 81,000
– డిస్కమ్స్: 41,0000

Also Read ‘వెంకీ మామ’ టాప్-10 రహాస్యాలు తెలుసా..?

9 Comments

  1. Whats up are using WordPress for your blog platform?
    I’m new to the blog world but I’m trying to get started and create
    my own. Do you need any html coding expertise to make your own blog?
    Any help would be greatly appreciated!

    Review my homepage – vpn special

  2. Undeniably believe that which you stated. Your favorite reason seemed to be
    on the net the simplest thing to be aware of. I say to you, I definitely
    get irked while people think about worries that
    they plainly do not know about. You managed to hit the nail upon the top and defined out the whole thing without having side-effects , people could take a signal.
    Will probably be back to get more. Thanks

    my web site – vpn special coupon

  3. I loved as much as you will receive carried out right here.
    The sketch is tasteful, your authored subject matter stylish.
    nonetheless, you command get bought an nervousness over that you wish be delivering the following.
    unwell unquestionably come more formerly again as exactly
    the same nearly very often inside case you shield this hike.

    Here is my website vpn 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button