తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TS Elections: చేవెళ్ల నుంచి సోనియాగాంధీ పోటీ చేయనుందా?

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ పీఏసీ తీర్మానించింది. పీఏసీ ఛైర్మన్ మాణిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. అందుకే ప్రతీ పార్లమెంట్ సెగ్మెంట్ కు ఒక్కో మంత్రికి ఇంఛార్జీ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

ALSO READ: మాజీ మంత్రి కేటీఆర్‌కు కర్ణాటక సీఎం కౌంటర్

మల్కాజిగిరి బరిలో దిగనున్నారా?

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఒకప్పుడు తెలంగాణ నుంచి పోటీ చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆమె కోడలు సోనియాగాంధీ కూడా అడుగుపెట్టనుంది. అయితే ఎక్కడినుంచి పోటీ చేస్తారనే విషయంపై తెలియాల్సి ఉంది. అయితే మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తారా? లేదా అత్త గెలిచిన మెదక్‌ నుంచి లేదా చేవెళ్ల నుంచి పోటీ చేసేలా పరిశీలిస్తున్నారు. మల్కాజిగిరి నుంచి ప్రధాని మోదీ పోటీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి సోనియాగాంధీ పోటీ చేయకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ALSO READ: లోక్ సభ ఎన్నికల పై కాంగ్రెస్ దృష్టి… 17 స్థానాలకు ఇంఛార్జుల నియామకం

మెదక్‌, లేదా కరీంనగర్ నుంచి పోటీ చేస్తారా?

గతంలో మెదక్ నుంచి ఇందిరాగాంధీ పోటీ చేసి గెలిచింది. అప్పట్లో 42 స్థానాలకు 41 చోట్ల కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు కూడా అదే స్ట్రేటజీతో వస్తున్నట్లు తెలుస్తోంది. మెదక్‌ సగ్మెంట్‌ను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు ఈ తీర్మానం చేసినట్లు సమాచారం. ఇక్కడ ఇందిరాగాంధీకి బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఏర్పాటును మొదట కరీంనగర్‌లోనే సోనియాగాంధీ ప్రకటన చేసింది. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలకు చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా ఇక్కడినుంచే సోనియాను బరిలోకి దించాలని భావిస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన లీడర్‌గా పేరు ఉన్నందున గెలిచే అవకాశం ఉందని చెబుతున్నారు.

ALSO READ: 1000 ఎకరాలు గుర్తించండి… అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశం

చేవెళ్ల కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్

సోనియాగాంధీ పోటీ చేసేందుకు పరిశీలనలో ఉన్న మరొకటి చేవెళ్ల. ఈ లోక్‌సభ పరిధిలో హైదరాబాద్ లోని అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఉంటాయి. గ్రేటర్‌లో కాంగ్రెస్ గెలవకపోయినప్పటికీ ఓట్ల శాతం పెరిగింది. మరోవైపు చేవెళ్ల కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్. మళ్లీ సోనియాగాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే సెంటిమెంట్ పునరావృతం అవుతుందని, పైగా చేవెళ్ల నియోజకవర్గం ఇన్‌చార్జ్‌గా సీఎం రేవంత్ రెడ్డిని నియమించారు. అంటే కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యత ఆయనదే. ఈ నేపథ్యంలో సోనియాగాంధీ చేవెళ్ల బరిలో నిల్చునే ఉద్ధేశం ఉందని, అందుకే ఈ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ బాథ్యతను సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించినట్లు టాక్ నడుస్తోంది. ఒకవేళ సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీచేస్తే.. చేవెళ్ల నుంచి బరిలో దిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button