తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Babar Azam: పాకిస్తాన్‌ ఆటగాడిపై గౌతం గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్ బాబర్‌ ఆజమ్‌‌పై భారత మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబర్‌కు వన్డే ప్రపంచకప్‌‌లో కెప్టెన్ ఇవ్వడంతో ఒత్తిడికి గురైనట్లు చెప్పాడు. ఇకవేళ అతడికి కెప్టెన్ ఇవ్వకుండా ఉంటే బాబర్ అసలు ఆట బయటపడేదని తెలిపాడు. అంతకుముందు బాబర్ ఆడిన మ్యాచ్‌లను చూస్తే తెలుస్తుందని, కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కూడా తీవ్ర ఒత్తిడి ఆయనపై ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ALSO READ: క్రికెట్ చరిత్రలో పెద్ద రికార్డ్.. కేవలం 43 బంతుల్లోనే 193 రన్స్

అత్యుత్తమ ఆట చూస్తాం

ప్రస్తుతం ఆస్ట్రేలియా, పాకిస్తాన్ సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో బాబర్‌ రాణిస్తారని గంబీర్ చెప్పుకొచ్చారు. ఈ సిరీస్‌లో బాబర్‌ ఆజమ్‌లోని అసలైన ఆట తిరిగి చూస్తామని తెలిపాడు. ఎందుకంటే కెప్టెన్ బాధ్యతలు లేనందున చాలా ప్రశాంతంగా ఆడనున్నట్లు చెప్పారు. వరల్డ్‌ కప్‌ కంటే ఈ సిరీస్‌లో డిఫరెంట్‌ బాబర్‌ను మనం చూస్తామని, ఈ టోర్నీలోనే బెస్ట్‌ బ్యాటర్‌గా నిలుస్తారని బాబర్‌పై గంభీర్ ప్రశంసలు కురిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button