తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Soumya Sarkar: సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన బంగ్లాదేశ్ బ్యాటర్.. నెట్టింట్లో ప్రశంసల వర్షం

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 14 ఏళ్ల రికార్డును బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ బద్దలు కొట్టాడు. ఆసియా నుంచి వన్డేలలో న్యూజిలాండ్‌ గడ్డపై అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్‌గా సౌమ్య రికార్డుల్లో నిలిచాడు. బుధవారం నెల్సన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో సౌమ్య సర్కార్ 151 బంతుల్లో 111.92 స్ట్రైక్ రేట్‌తో 169 పరుగులు చేసి ఈ రికార్డు నెలకొల్పాడు.

Also read: Mitchell Starc: ధరను చూసి షాకయ్యా.. ఐపీఎల్ వేలంపై మిచెల్ స్టార్క్ రియాక్షన్

కాగా.. 2009లో న్యూజిలాండ్‌ లోని క్రిస్ట్‌చర్చ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ టెండూల్కర్‌ 163 పరుగులు చేశాడు. ఆసియా ఖండం నుంచి వచ్చిన బ్యాటర్లకు వన్డేలలో కివీస్‌ గడ్డపై ఇదే అత్యధిక స్కోరు. తాజాగా బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. 151 బంతుల్లో 22 బౌండరీలు, 2 సిక్సర్లతో 169 పరుగులు చేశాడు. భారీ సెంచరీ బాదిన సౌమ్యపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. న్యూజిలాండ్‌ పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

నెల్సన్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ ఓడిపోయింది. మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 49.5 ఓవర్లలో 291 పరుగుల ఆలౌట్ అయింది. సౌమ్య సర్కార్‌ సెంచరీ చేయగా ముష్ఫీకర్‌ రహీమ్‌ (45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం లక్ష్య ఛేదనలో కివీస్‌ 46.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button