తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Boxing Day Test: ఆసీస్ ఆలౌట్.. పాక్ స్కోర్ ఎంతంటే?

మెల్‌బోర్న్‌ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భాగంగా ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ పూర్తయింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్.. తొలిరోజు 3 వికెట్ల న‌ష్టానికి 187 పరుగులు.. రెండో రోజు తొలి సెష‌న్‌లో మ‌రో 131 ప‌రుగులు చేయగా.. ఓవరాల్‌గా మొదటి ఇన్నింగ్స్‌లో 318 పరుగులకు ఆలౌటైంది. మార్న‌స్ ల‌బూషేన్(63), ఖావాజా(42), ఆల్‌రౌండ‌ర్ మిచెల్ మార్ష్(41) పరుగులు చేశారు. పాక్ బౌల‌ర్లలో అమ‌ర్ జ‌మాల్ మూడు, హ‌స‌న్ అలీ, మిర్ హ‌మ్జా చెరో రెండు వికెట్లు తీశారు.

ALSO READ:  ఆస్ట్రేలియాతో మహిళల వన్డే, టీ20 సిరీస్.. జట్లు ఇవే

పాక్‌ వికెట్ న‌ష్టానికి 63 ప‌రుగులు

ఆసిస్ ఇన్నింగ్స్ అనంతరం బ్యాటింగ్ చేపట్టిన పాక్‌.. వికెట్ న‌ష్టానికి 63 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ అబ్దుల్లా ష‌ఫిక్‌(37), కెప్టెన్ షాన్ మ‌సూద్(13) నిల‌క‌డగా ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ ఇంకా 255 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది. కాగా, తొలి టెస్టులో పాక్‌ను ఆస్ట్రేలియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button